SCR restored passenger trains today పట్టాలెక్కిన ప్యాసింజర్ రైళ్లు.. స్టేషన్లలోనే టికెట్లు

South central railway restored passenger trains today

Good news for train commuters in South Central Railway Zone. The authorities of the South Central Railway (SCR) zone restored all 66 passenger trains today. The first passenger train from secundrabad to kalaburagi reached Tandur by 6AM today.

Good news for train commuters in South Central Railway Zone. The authorities of the South Central Railway (SCR) zone restored all 66 passenger trains today. The first passenger train from secundrabad to kalaburagi reached Tandur by 6AM today.

పదహారు నెలల తరువాత కూత పెట్టిన ప్యాసింజర్ రైళ్లు.. స్టేషన్లలోనే టికెట్లు

Posted: 07/19/2021 11:46 AM IST
South central railway restored passenger trains today

రైలు ప్రయాణికులకు గతవారంలో శుభవార్తను చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఇవాళ ఉదయం నుంచి ఆ మాటలను నిలబెట్టుకుంది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా రైళ్లు రద్దు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అనేక ప్యాసింజర్ రైళ్తతో పాటు పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు కూడా రద్దు అయిన విషయం తెలిసిందే. దీంతో కాసింత దూర ప్రయాణాలకు వెళ్లి తిరిగి రాత్రి సమయానికి ఇళ్లకు చేరుకోవాల్సిన ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, నిత్యం ఏదో వ్యవహరాలపై తిరేగే వారు రైళ్లుకు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే గత వారం తన పరిధిలో రద్దైన సాధారణ రైళ్లతో పాటు ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తామని చెప్పింది. ఈనెల 19 నుంచి సాధారణ రైళ్లన్నీ పట్టాలెక్కనున్నాయని ప్రకటించినట్లుగానే ఇవాళ ఉదయం నుంచి సాధారణ రైళ్తతో పాటు ఎక్స్ ప్రెస్ రైళ్లు, ఫ్యాసింజర్ రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 82 రైళ్లను పునరుద్దరించింది. వీటిలో 16 రైళ్లు ఎక్స్‌ప్రెస్‌ కాగా 66 ప్యాసింజర్‌ రైళ్లు వున్నాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ఇక అన్నట్టుగానే ఇవాళ ఉధయం తొలి ఫ్యాసింజర్ రైలు ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కర్ణాటకలోని కాలబురాగీకి బయలుదేరింది. ఉదయం ఆరు గంటల సమయానికి ఈ ఫ్యాసింజర్ రైలు తాండూరుకు చేరుకుంది. ఇక ఆ తరువాత ఈ ఉదయం 8.50 గంటలకు ఫలక్‌నుమా నుంచి వాడీ వెళ్లే రైలు తాండూరుకు చేరుకుంది. ఇవే కాకుండా సికింద్రాబద్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కడప తదితర ప్రాంతాల నుంచి కదలాల్సిన అరవై రైళ్లు కూడా బయల్దేరాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కాలబురాగీ, వాడీలకు కూడా రైళ్లు బయలుదేరి వెళ్లాయి.

ఫ్యాసింజర్ రైళ్లను పునరుద్ధరిస్తున్న నేపథ్యంలో రైల్వే స్టేషన్లలోనే కరెంట్ బుక్కింగ్ టికెట్లను జారీ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మూడో దశ అందోళన మాత్రం ఇంకా నేలకొన్న నేపథ్యంలో ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణికులందరూ కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. చేతులను శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని పేర్కొంది. స్టేషన్లు, రైళ్లలో కొవిడ్‌ ప్రొటోకాల్‌ అమలులో వుందని ప్రయాణికులు తగు జాగ్రత్తలను పాటించాలని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles