టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు గృహనిర్భంధంలో వుంచారు. ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా వేలం వేసిన కోకాపేట భూములలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని అరోపించిన రేవంత్ రెడ్డి.. తమ పార్టీ ఇవాళ వాటిని సందర్శించనుందిని నిన్ననే ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచి భారీగా పోలీసులు మొహరించారు.
రేవంత్రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ కోకాపేట భూములను సందర్శించడానికి వీలు లేదని పోలీసులకు అదేశాలు జారీ చేసిందో లేక వారే ముందుజాగ్రత్తా రేవంత్, భట్టి మల్లు విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతలను వారి ఇళ్లలోనే గృహ నిర్బంధం చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శనతో పాటు అక్కడ ధర్నా కూడా చేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ భూముల వేలంలో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన అరోపించారు.
ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని హౌస్ అరెస్ట్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కొకాపేట భూములను ముట్టడించి కాంగ్రెస్ జెండాలను పాతారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తదితర నాయకులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం తక్కువ ధరలకు టిఆర్ఎస్ అనుచరులు, కేసీఆర్ బినామీలు వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడారని వారు ఆందోళన చేశారు. కాగా పోలీసుల తోపులాటలో కింద పడి పోయిన మహేష్ కుమార్ గౌడ్ కాలికి గాయాలయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more