బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలో అమల్లో వున్నా పాన్ డమిక్ ఆంక్షలను మూడు రోజుల మినహాయింపు ఇచ్చిన కేరళ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ వెసలుబాటు కల్పించడంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారుల డిమాండ్ కు తలొగ్గి ఆంక్షలను సడలిస్తున్నారంటే.. రాష్ట్రంలో పాలనా వ్యవహారాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వాన్ని తీవ్రంగా తలంటింది.
కేరళ ప్రభుత్వం నిర్ణయంపై విస్మయానికి గురిచేస్తోందని మండిపడిన అత్యున్నత న్యాయస్థానం.. వ్యాపారం చేసుకునేవారి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రజల ఆరోగ్యంగా జీవించే హక్కును కాలరాయరాదని హెచ్చరించింది. కరోనా విజృంభనలో దేశంలోనే మహారాష్ట్ర, తమిళనాడు తరువాత కేరళ రాష్ట్రం వుందన్న విషయాన్ని మర్చిపోయారా.? అని ప్రశ్నించింది. ప్రజారోగ్యం కన్నా పండుగలు ముఖ్యమయ్యాయా.? అని నిలదీసింది. ప్రజలు అరోగ్యంగా ఉంటే అదే ప్రభుత్వాలకు పండగా అన్న విషయం తెలియదా.? అని ప్రశ్నించింది.
ఇప్పటికే ఆంక్షల ఎత్తివేత అమల్లోకి వచ్చినందున.. కేరళ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. ఈ మినహాయింపులతో కరోనా కేసులు భారీగా పెరిగితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని కేరళ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి మినహాయింపులివ్వడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 21, ఆర్టికల్ 144ను కేరళ ప్రభుత్వం ఒకసారి క్షుణ్ణంగా చదువుకోవాలని, కన్వర్ యాత్ర కేసుకు సంబంధించి తామిచ్చిన ఆదేశాలను ఇక్కడా పాటించాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more