కలియుగ వైకుంఠధామంగా భక్తుల కోంగుబంగారంగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులు ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం ఇసుక రాలనంత సంఖ్యలో జనం తిరుమలకు చేరుకుని దేవదేవడ్ని దర్శించుకుంటారు. ఇలా తిరుమల సప్తగిరులకు చేరుకునే భక్తులు అద్దె గదులు దొరక్క అవస్థలు పడుతున్నారు. అద్దె గదుల కోసం పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటున్నాయి. గంటల గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం బోర్డు వారికి ఉపశమనం కల్పించింది.
ఇకపై భక్తులకు మరింత వేగంగా, సులభంగా అద్దె గదులను అందించేందుకు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి అధికారులను అదేశించారు. అందుకోసం మరో కొత్త సాప్ట్ వేర్ ను టీటీడీ అధికారులు వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులు అద్దె గది కోసం ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు గదుల కోసం తాము రిజర్వు చేసుకున్న స్లిప్పులను తిరుపతిలోనే స్కాన్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం అలిపిరి టోల్ గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు.
తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్ చేసుకున్న 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో వెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి గంటలో ఎస్ఎంఎస్లు వస్తాయన్నారు. ఎస్ఎంఎస్ రాగానే భక్తులు నేరుగా విచారణ కార్యాలయానికి వెళ్లి గదులు పొందొచ్చని తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలో గురువారం వసతి కల్పనకు నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారులతో ఈవో సమీక్షించారు. అనంతరం టీటీడీ కాల్ సెంటర్ ద్వారా వస్తున్న పలు ఫిర్యాదులను విభాగాల వారీగా సమీక్షించారు. అంతకుముందు రిసెప్షన్ అధికారులు నూతనంగా రూపొందించిన అకామిడేషన్ మేనేజ్ మెంట్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈవోకు వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more