Raids At Over 20 Properties Of AIADMK Leader MR Vijayabhaskar ఆమ్యామ్యాలతో ఆస్తులను పదిరెట్లు పెంచుకున్న మాజీమంత్రి..

Dvac searches 21 premises of ex tamil nadu minister mr vijayabhaskar in chennai and karur

MR Vijayabhaskar, raids, raids on Vijayabhaskar, DVAC, AIADMK, Former Transport Minister, Tamil Nadu, Crime

Officials from the directorate of vigilance and anti-corruption in Tamil Nadu are conducting raids at least 20 properties of former Transport Minister MR Vijayabaskar. According to sources, the raids are in connection with corruption allegations in the transport department when the AIADMK was in power.

ఆమ్యామ్యాలతో ఆస్తులను పదిరెట్లు పెంచుకున్న మాజీమంత్రి..

Posted: 07/23/2021 08:17 PM IST
Dvac searches 21 premises of ex tamil nadu minister mr vijayabhaskar in chennai and karur

ఎన్నికలలో గెలిచి ఎమ్మెలుగా, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అమాత్యులు.. ప్రజలకు ముఖ్య సేవకులుగా వుంటామని ప్రమాణం చేసి.. పగ్గాలు చేపట్టగానే అందినకాడికి అమ్యామ్యాలు తీసుకుని తమ అస్తులను పెంచుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. తమిళనాడులో ఇలాంటి చర్యలకే పాల్పడిన మాజీమంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ ఐదేళ్లుగా అక్రమాస్తిని పోగేస్తూ.. పది రెట్లు పెంచినట్లు ఆవినీతి నిరోధకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జులై 22న అక్రమాస్తుల ఆరోపణలతో అతని ఇంటిపై దాడి చేసిన అధికారులు షాక్ అయ్యారు.

ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు భారీగా నగదు, బ్యాంకు లావాదేవీలు, లాకర్లు, కంపెనీ పత్రాలను సీజ్‌ చేశారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో రవాణాశాఖా మంత్రిగా వ్యవహరించిన ఆయన తన శాఖపరిధిలో ఉద్యోగ నియామకాలు, కొత్త బస్సులు, విడిభాగాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. చెన్నై, కరూరు జిల్లాల్లో ఏకకాలంలో 21 స్పెషల్ టీంలు మాజీమంత్రికి చెందిన పరిశ్రమలు, బంధువుల ఇళ్లు, ఆయన అనుచరుడైన అన్నాడీఎంకే మాజీ కౌన్సిలర్‌ ఏకాంబరం ఇంటిలో గురువారం ఉదయం 6గంటల 30నిమిషాల నుంచి నిర్విరామంగా 14 గంటలపాటూ గురువారం అర్ధరాత్రి వరకు సోదాలు జరిపారు.

26 ప్రాంతాల్లో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అధికార, అనధికార కార్యకలాపాలు జరిపే చెన్నై రాజా అన్నామలైపురంలోని అపార్ట్‌మెంటు నుంచి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్, పెన్‌ డ్రైవ్‌లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎంఆర్‌ విజయభాస్కర్, ఆయన సతీమణి విజయలక్ష్మి, సోదరుడు శేఖర్‌ భాగస్వామ్యులుగా ఉన్న సంస్థలు, బంధువులు, సహాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో కొందరు బినామీలు చిక్కారని తెలుస్తోంది. సదరు కంపెనీల బ్యాంకు లావాదేవీలను, లాకర్లను సీజ్‌ చేశారు. చెన్నైలోని ఇంటి నుంచి 50 సవర్ల నగలు, రెండున్నర కిలోల వెండి వివరాలను రికార్డుల్లో నమోదు చేసి తిరిగి ఇచ్చేశారు.

26 చోట్ల జరిగిన తనిఖీల్లో రూ.25.56 లక్షల నగదు, కోట్ల రూపాయల ఆస్తి పత్రాలు, పెట్టుబడులు, కంపెనీలకు చెందిన లావాదేవీల విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి. దాడుల సమయంలో ఇంటిలోనే ఉన్న మాజీ మంత్రి విజయభాస్కర్‌ వద్ద ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. మంత్రి పదవిలోకి రాకముందు, ఆ తరువాత ఆస్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 26 చోట్లలో స్వాధీనం చేసుకున్న నగదు, స్థిర, చరాస్తులతో పోల్చిచూసుకుని పదింతలు ఆస్తి సంపాదించినట్లు తేలిందని ఏసీబీ వర్గాలు నిర్ధారించుకున్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MR Vijayabhaskar  raids  raids on Vijayabhaskar  DVAC  AIADMK  Former Transport Minister  Tamil Nadu  Crime  

Other Articles