ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బలి తీసుకుంటున్న కరోనా మహమ్మారి తాజాగా ఓ నిండు కుటుంబాన్ని మొత్తం బలితీసుకుంది. భార్య, కుమారుడితో కలిసి అదృశ్యమైన జెన్కో ఉద్యోగి కుటుంబం కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక బాధలకు తోడు అనారోగ్య సమస్యలు వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించిన జెన్కో ఉద్యోగి.. తాను చనిపోతే భార్య, కుమారుడు అనాథలు అవుతారని, వారిని కూడా అర్థిక ఇబ్బందులు కుంగదీస్తాయన్న ఉద్దేశంతో వారిద్దరితో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. స్థానికంగా నివాసం ఉండే మండారి రామయ్య (36) జెన్కోలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య నాగమణి (30), కుమారుడు సాత్విక్ (12) ఉన్నారు. రామయ్యకు గత కొంతకాలంగా తరచూ జ్వరం వస్తుండడంతో పది రోజుల క్రితం మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. నాలుగు రోజుల క్రితం చేయించుకున్న కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఆందోళనకు లోనైన రామయ్య ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అయితే, తానొక్కడిని చనిపోతే భార్యాబిడ్డలు అనాథలైపోతారని భావించి అందరూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని లేఖ రాసి ఇంట్లో పెట్టి ద్విచక్ర వాహనంపై సాగర్ కొత్త వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడ బైక్, సెల్‌ఫోన్ వదిలిపెట్టారు. తొలుత కుమారుడు సాత్విక్ ను నదిలోకి తోసేశారు. ఆ తర్వాత రామయ్య, నాగమణి ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని దూకారు. జెన్ కో ఉద్యోగి అదృశ్యం ఘటన కలకలం రేపడంతో రంగంలోకి దిగిన పోలీసులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కొత్త వంతెన వద్ద రామయ్య బైక్, సెల్‌ఫోన్ కనిపించడంతో నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావించి గాలించారు.
ఈ క్రమంలో నిన్న ఉదయం చింతలపాలెం జమ్మనకోట తండా వద్ద నది ఒడ్డున సాత్విక్ మృతదేహం లభ్యం కాగా, ఆవలి ఒడ్డున రామయ్య, నాగమణి మృతదేహాలు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఉన్న స్థితిలో గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. తిరుమలగిరి (సాగర్) మండలం చింతలపాలేనికి చెందిన రామయ్య వ్యవసాయ భూమి టెయిల్‌పాడ్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైంది. నిర్వాసితులకు ఇచ్చే ఉద్యోగాల్లో భాగంగా రామయ్యకు జెన్కోలో అటెండర్ ఉద్యోగం లభించినట్టు పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more