దేశంలో అత్యంత చౌకగా లభిస్తున్నా కరోనా టీకాతో అత్యంత రక్షణ పోందవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. దేశీయంగా ప్రజలందరికీ కరోనా టీకాలను ఉచితంగానే అందిస్తున్న ప్రభుత్వం.. తమ సమయం వరకు వేచిచూసే యోచన లేనివారి కోసం ప్రైవేటు అసుపత్రులలో డబ్బులకు టీకాలను వేస్తోన్న విషయం తెలిసిందే. ఉచితం సెంటర్లలో కనబడని వాక్సీన్లు ఈ ప్రైవేటు అసుపత్రులలో మాత్రం విరివిగా లభిస్తున్నాయన్న విమర్శలు ఇప్పటికే వున్నాయి. ఇక దేశంలో ఇప్పటివరకు అందుబాటులో వున్న నాలుగు రకాల వాక్సీన్లు కూడా ప్రైవేటులో అందుబాటులో వున్నాయి.
కానీ ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్న కేంద్రాల్లో అత్యధికంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్ మాత్రమే అందుబాటులో వున్నాయన్న వార్తలు వినిపించాయి. అయితే దేశీయంగా రూపోందిన ఈ వాక్సీన్లకే అత్యధిక రక్షణ శక్తి ఉందన్న విషయం తాజాగా అధ్యయంలో తేలింది. ఇక అందులోనూ ప్రైవేటులో అత్యల్ప ధరకు లభ్యమయ్యే కొవిషీల్డ్ టీకాల వల్ల 93 శాతం రక్షణ లభిస్తున్నట్టు సైనిక దళాల వైద్య కళాశాల అధ్యయనం పేర్కొంది. ఈ వ్యాక్సిన్ మరణాల రేటును 98 శాతం వరకు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో 15 లక్షల మంది వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను కేంద్రం విడుదల చేసింది.
ఇక ఇదే సమయంలో విదేశాలలో రూపోందించబడిన ఫైజర్, ఆస్ట్రాజెనెకా టీకాలపై కూడా అద్యయానాలు చేశాయి అక్కడి పరిశోధనా కేంద్రాలు. మరీ ముఖ్యంగా బ్రిటన్ లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పైజర్, అస్ట్రాజెనికా టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు వేగంగా ఉత్పత్తి అవుతున్నాయి.. కానీ అంతే వేగంగా అవిరైపోతున్నాయని అద్యయనంలో తేలింది. ఈ రెండు టీకాలు వేసుకున్న వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు ఆరు వారాల తర్వాత క్రమంగా క్షీణిస్తున్నట్టు వారి అధ్యయనంలో తేలింది.
ఆస్ట్రాజెనెకాతో పోలిస్తే ఫైజర్ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీల స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఆ తర్వాత మాత్రం క్రమంగా అవి క్షీణిస్తున్నట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వారితో పోలిస్తే టీకా తీసుకున్న వారిలోనే ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. పైన చెప్పిన టీకాలు రెండు డోసులు తీసుకున్న తర్వాత యాంటీబాడీల స్థాయి తొలుత బాగానే ఉన్నప్పటికీ రెండుమూడు నెలల తర్వాత గణనీయంగా పడిపోవడాన్ని గుర్తించినట్టు పరిశోధనలో పాల్గొన్న మధుమితా శ్రోత్రి తెలిపారు. ఈ అధ్యయన ఫలితాలు ‘లాన్సెట్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more