బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేసిన పోలీసులు పోర్నోగ్రఫీ (నీలిచిత్రాలకు) సంబంధించిన కేసు విచారణలోనూ వేగాన్ని పెంచారు. ఇప్పటికీ ఆయనను తమ కస్టడీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న పోలీసులు.. ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిలకు చెందిన నివాసాలు, వ్యాపార సముదాయాలలో సోదాలు నిర్వహించారు. కాగా, ఈ కేసులో మరింత లోతైన విచారణను చేస్తున్న పోలీసులు అతని బ్యాంక్ అకౌంట్లకు చెందిన లావాదేవీలపై ఆరా తీసేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్లను నియమించారు.
కాగా, ఈ కేసులో బాలీవుడ్ నటి, రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టికి ఇంకా క్లీన్ చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ పేరిట ఉన్న ఓ జాయింట్ అకౌంట్ ను పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వియాన్ పరిశ్రమే పోర్న్ రాకెట్లో కీలకంగా మారిందని వారు తెలిపారు. ఆ కంపెనీలో శిల్పాశెట్టి కూడా డైరక్టర్ గా పనిచేస్తున్నారని తేలిందని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని అన్నారు. కాగా ఈ కేసులో నటి శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.
రాజ్ కుంద్రాకు చెందిన కొన్ని బ్యాంక్ అకౌంట్లలోకి విదేశాల నుంచి డబ్బులు డిపాజిట్ అయినట్లు గుర్తించామని చెప్పిన పోలీసులు.. అదే విధంగా శిల్పాశెట్టి అకౌంట్లను పరిశీలించిన తరువాత అమెకు విదేశాల నుంచి ఎలాంటి లావాదేవీలు జరిగినట్టు తేలలేదని అన్నారు. ఈ కేసులో ఇప్పటికీ విచారణ కొనసాగుతోందని, బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని, ఇప్పుడే శిల్పాశెట్టికి క్లీన్ చిట్ ఇవ్వలేమని ఓ అధికారి తెలిపారు. గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కుంద్రా అకౌంట్లోకి 1.17 కోట్లు వచ్చినట్లు ఆడిటర్స్ గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more