Congress MLA Komatireddy Rajagopal Reddy arrested దళితబంధు అమలుకు డిమాండ్.. రాజగోపాల్ రెడ్డి అరెస్ట్..

Tension erupts in munugode amid komatireddy rajagopal reddy arrest

Nalgonda, TRS, Congress, Munugode, Komatireddy Rajagopal reddy, Telangana minister, Jagadishwar reddy, komatireddy brothers, congress mla munugode, jagadishwar reddy, Convey obstructed, new Ration cards program, Telangana, Politics

Munugode MLA Komatireddy Rajagopal Reddy was arrested by police today after he tried to obstruct Jagadish Reddy from visiting his constituency Munugode to distribute new ration cards.

దళితబంధు అమలుకు డిమాండ్.. రాజగోపాల్ రెడ్డి అరెస్ట్..

Posted: 07/28/2021 03:04 PM IST
Tension erupts in munugode amid komatireddy rajagopal reddy arrest

తెలంగాణ ప్రభుత్వంలోని అమాత్యులు ప్రోటోకాల్ పాటించకుండా నియోజకవర్గాల పర్యటనలు ఎలా చేస్తున్నారంటూ మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలను తలపెట్టిన నేపథ్యంలో తనకు ఆహ్వానం లేకుండా ఎలా చేస్తారని ఆయన అక్షేపించారు. ఇందులో భాగంగా ఇవాళ మునుగోడులో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను అందజేసే కార్యక్రమానికి మంత్రి జగదీశ్వర్ రెడ్డి వస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రాజగోపాల్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ఇక హైదరాబాద్ నుండి మునుగోడుకు వస్తున్న రాజగోపాల్ ను కూడా ఔటర్ రింగ్ రోడ్డుపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఇటీవల జరిగిన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రసంగం అడ్డుకుని.. ఆయన చేతిలోంచి మైక్ లాగేసుకుని రభస చేశారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై ఇప్పటికే చౌటుప్పల్ ఎమ్మార్వో గిరిధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఇవాళ అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకువచ్చిన ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికలకు ముందు హుజూరాబాద్ లో ప్ర‌వేశ‌పెడుతున్న ఈ పథకం కేవలం ఎన్నికల గిమ్మిక్కుగా ఆయన అభివర్ణించారు. తమ అరోపణలు సత్యదూరమైతే.. ఈ పథకాన్ని త‌న‌ మునుగోడు నియోజకవర్గ దళితులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో మంత్రులు పర్యటించాలంటే ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదా.? అంటూ నిలదీశారు.

పోలీసులు పలువురు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. పోలీసుల తీరుపై రాజగోపాల్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేత‌లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నిర్బంధాలు చేస్తుండ‌డం సరికాదని ఆయ‌న అన్నారు. అరెస్ట్ చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను వెంటనే విడుదల చేయాల‌ని రాజ‌గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతం కాదని, త్వరలో తామేంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వ‌బోమ‌ని హెచ్చ‌రించారు. తెలంగాణ‌ వ్యాప్తంగా దళితులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. మునుగోడుకు జగదీశ్‌ రెడ్డి నిధులు తీసుకురావడం లేదని చెప్పారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేంద‌ర్‌ను ఓడించేందుకు దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles