ఏడేళ్లుగా ముఖ్యమంత్రి హోదాలో వున్న కేసీఆర్.. ఏ ఒక్క రోజైనా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా.? అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డి ప్రశ్నించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళితసంఘాల నేతలను ప్రగతిభవన్ కు పిలిపించుకున్న ఆయన.. అక్కడ అంబేత్కర్ చిత్ర పటానికి పూలమాల వేశారన్నారు. మరోమారు దళితులను వెన్నుపోటు పోడిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పథకరచన చేశారని, ఆయనను నమ్మితే దళితులు నట్టేట మునగడం ఖాయమని హితవు పలికారు.
దళితబంధు పథకాన్ని హూజూరాబాద్ కు మాత్రమే కాకుండా... రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ ఎందుకు అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల తరువాత ఈ పథకం అటెకెక్కడం గ్యారంటీ అని అమె అన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే దళితులందరికీ మూడెకరాల భూమిని ఇస్తామన్న హామి ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆ హామీ ఎందుకు నెరవేరలేదని అమె ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు.. దళితులకు ఏదో మేలు చేస్తున్నట్లు పథకాలను తీసుకువచ్చి.. ఆ తరువాత వాటిని అటెక్కెక్కించే నైజం కేసీఆర్ దేనని విమర్శించారు.,
దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. అధికారంలోకి రాగానే తానే ముఖ్యమంత్రినని ప్లేటు ఫిరాయించారని అమె గుర్తు చేశారు. ఈ మాట కేసీఆర్ చెప్పలేదంటే తాను తల నరుక్కుంటానని అన్నారు. ఉద్యమంలో ఆది నుంచి వున్న ఈటెలకు పదవి నుంచి తప్పించి.. ఉద్యమం చివరిదశలో పిలిపించుకున్న తనయుడ్ని ముఖ్యమంత్రిని చేయాలని పథకరచన చేస్తున్నారని అమె విమర్శించారు. దళితులకు ముఖ్యమంత్రి పీఠం ఇస్తానన్న మాట నేరవేర్చలేదు.. కనీసం ఉపముఖ్యమంత్రి కూడా శాశ్వతంగా దళితవర్గాలకు కేటాయించలేదు.. ఇక ఆయన తీసుకువచ్చే పథకాలకు మాత్రం దళిత బంధు అని పేర్లు పెట్టి మోసం చేస్తారా.? అని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం గత ఏడేళ్లలో రూ. 85,913 కోట్లను కేటాయించారని.. అయితే కేవలం రూ. 47,685 కోట్లను మాత్రమే ఖర్చు చేశారని... మిగిలిన రూ. 38 వేల కోట్లు ఎక్కడకు వెళ్లాయని ప్రశ్నించారు. ఆ మొత్తాన్ని ఎక్కడ వాడారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు కోసం కనీసం నోడల్ కమిటీ, స్టేట్ కమిటీ, అపెక్స్ కౌన్సిల్ సమావేశం కూడా నిర్వహించని ఘనత కేసీఆర్ సొంతమని గీతారెడ్డి మండిపడ్డారు. సబ్ ప్లాన్ కోసం కేటాయించిన నిధులనే ఖర్చు చేయని కేసీఆర్.. ఇప్పుడు దళితులకు రూ. 10 లక్షల చొప్పున ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. లోన్ల కోసం 5.33 లక్షల మంది దళితులు దరఖాస్తు చేస్తే.. అందులో 1.16 లక్షల మందికి మాత్రమే లోన్లు ఇచ్చారని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more