సమాజంలో ఇప్పటికే నో స్మోకింగ్ జోన్ మాదిరిగా.. నో కిస్సింగ్ జోన్ అని జనారణ్యంలోని హౌస్సింగ్ కాలనీ సోసైటీలు బోర్డులు పెడుతున్నాయంటే పరిస్థితులు ఎంతలా మారిపోతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక అలాంటి వారికి పచ్చని పైరు.. కోండలు, కోనలు.. నిర్జన.. నిర్మానుష్య ప్రాంతం కనిపిస్తే.. ప్రకృతిని అస్వాదించేందుకు బదులు వీరు మరేదో అస్వాధించేందుకు ముందుటారన్నది నిజం. ప్రతీ విషయాన్ని ముందుగానే పసిగట్టే పెద్దలు.. కామా తురానాః నభయం నలజ్జ అన్న నానుడిని కూడా అందుకనే చెప్పారమో అనిపిస్తోంది.
నాలుగు గోడల మధ్య మూడోకంటికి తెలియకుండా చేయాల్సిన శృంగారాన్ని పశువుల మాదిరిగా రోడ్లపైనే చేసేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. ఇది వారిలోని సభ్యత, సంస్కారానికి దర్పణం పడుతుంది. ఆడ, మగ అనే తేడా లేకుండా యువత మరీ బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడానికి, కొంచెం మసకమసక చీకటి ఉంటే చాలు హద్దులు దాటడానికి అస్సలు వెనుకడుగు వేయడం లేదు. తాజాగా, అలాంటి ఘటనే బీహార్ రాష్ట్రంలోని గయ పట్టణంలో చోటుచేసుకుంది. ఓ యువజంట బైక్పై వెళ్తూ బరితెగించి మరీ రొమాన్స్ చేసింది.
యువకుడు బైక్ నడుపుతుండగా సినిమా స్టైల్ లో యువతి అతనికి ఎదురుగా పెట్రోల్ ట్యాంక్పై కూర్చుని ముద్దులు పెట్టింది. నడి రోడ్డుపై రన్నింగ్ బైక్పై ఇలా చేస్తుంటే చూసేవాళ్లు ఏమనుకుంటారు..? అనే సోయి కూడా ఆ జంటకు లేకుండా పోయింది. అయితే, చివరికి దారిలో ఓ గ్రామస్తులు.. ఆ బరితెగించిన జంటను ఆపి తిక్కకుదిర్చారు. నడిరోడ్డుపై సభ్యత సంస్కారం లేకుండా ఏమిటీ పిచ్చి పనులని నిలదీశారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన పనులు నడిరోడ్డుపై చేయడానికి సిగ్గలేదా అని మందలించారు. రన్నింగ్ బైక్పై ఇంత బరితెగింపు అవసరమా అని ప్రశ్నించారు.
మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కంటబడితే కాళ్లు, చేతులు విరగ్గొడుతామని హెచ్చరించారు. ఇక గ్రామస్తుల తిట్లతో ఆ యువజంట కిక్కు దిగిపోయింది. ఊహించని పరిణామంతో వాళ్లు కంగుతిన్నారు. యువతి పెట్రోల్ ట్యాంక్ దిగి బుద్ధిగా వెనుకాల సీట్లోకి వెళ్లి కూర్చుంది. అనంతరం ఆ యువజంట గ్రామస్తులకు బాయ్ చెప్పి బతుకుజీవుడా అంటూ బయటిపడింది. అయితే, ఆ యువజంట బైక్పై రొమాన్స్ చేసిన వీడియోను గుర్తుతెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more