మందేసినోళ్ల వేషాలు ఎట్టా ఉంటాయో చాలా మందికి తెలుసు. ఇక అదే మందు కిక్కు తలకెక్కితే.. మత్తు నషాలనికి ఎక్కితే.. వారు వ్యవహరించే తీరు.. వారు మాట్లాడే మాటలు కూడా వంకర టింకరగా వస్తుంటాయి. చెప్పిందే చెప్పి.. ఎదుటివారికి చికాకు తెప్పించడంలో వీరు ఘనాపాటీలు. ఇక మరికొందరైతే గాన గంధర్వులవుతారు.. ఆ పాట నేను పాడితే ఇలా వుంటుంది.. అంటూ తమలోని టాలెంట్ ను బయటపెట్టేస్తుంటారు. ఇంకోందరి రూటే సపరేటు.. వీరంతా రెబెల్స్.. ఎదుటివారు తమను చూడకపోయినా వచ్చి తమనెందుకు చూశావ్ అంటూ నానా హంగామా చేసే బ్యాచ్. ఈ బ్యాచ్ తో మహాకష్టం.
అయితే ఇదంతా పురషపుంగములు చేసే పనులే.. వీరి చర్యలు చేస్తూనే వామ్మో అనుకుంటే.. ఇక ఈస్థానంలో మహిళలు వుంటే.. ఊహించుకోడానికే కొంత వెగటుగా వుంటుంది. ఎందకంటే మన దేశంలో మహిళకు ఇచ్చిన స్థానం శక్తి స్థానం కాబట్టి. నూటికో కోటికో ఒక్కరు అన్నట్లు అక్కడక్కడా కొందరు మద్యం సేవించే మహిళలు వున్నారే కానీ.. ఇలా రోడ్డుపైకి వచ్చి నానా యాగీ చేసే మహిళలు మాత్రం దాదాపుగా కనిపించరు. కానీ పూణే లో ఒక మహిళ మందేసి రోడ్డుమీదకు వచ్చి నానా రచ్చ చేసి.. వాహనాలు వెళ్లనీయకుండా ట్రాఫిక్ జామ్ కు కారణమైంది.
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో పూణే లోని తిలక్ రోడ్డు హీరాబాగ్ చౌక్ వద్ద ఓ మహిళ రోడ్డుపై కూర్చుని వివిధ భంగిమల్లో యోగాసనాలు వేయటం మొదలెట్టింది. ఆ సమయంలో ట్రాఫిక్ కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మహిళ మద్యం సేవించిందని తెలుసుకున్న స్ధానికులు స్వర్గేట్ పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చేసరికి ఆయువతి అక్కడినుంచి వెళ్లిపోయింది. కానీ యువతి చేసిన విన్యాసాలను తమ సెల్ఫోన్లో రికార్డు చేసిన స్ధానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
A drunk girl in Pune sitting in the middle of the road
— Varun Bahl
Video from @IndiaToday pic.twitter.com/7DTiIV9JEs
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more