ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీకి సంబంధించిన ఓ జాబ్ సర్కులర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ జాబ్ సర్కులర్లో ఉన్న కండీషన్ చూసి అంతా విస్తుపోతున్నారు. ఇదెక్కడి చోద్యం అని అవాక్కవుతున్నారు. అంతా దాని గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ అందులో ఏముందో తెలుసా.. కరోనా బ్యాచ్ కి నో ఎంట్రీ. అంటే, 2021లో ఎగ్జామ్స్ రాయకుండా పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అనర్హులు అని అర్థం. హెచ్.డి.ఎఫ్.సి. బ్యాంక్.. డిగ్రీ క్వాలిఫికేషన్ తో.. జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అందులో.. 2021 పాసవుట్ బ్యాచ్ నాట్ ఎల్జిబుల్ అని స్పష్టంగా ఉంది. ఈ కండీషన్ కారణంగా జాబ్ సర్కులర్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఇదెక్కడి చోద్యం రా బాబూ అని అంతా విస్తుపోతున్నారు. ఈ సర్కులర్ ను తెగ షేర్ చేస్తున్నారు. దీనిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఈ సర్కులర్ వైరల్ కాడం, వివాదానికి దారి తీయడంతో హెచ్ డీ ఎఫ్ సీ యాజమాన్యం స్పందించింది. ఈ సర్కులర్ పై స్పష్టత ఇచ్చింది. అది అక్షర దోషం అని వివరణ ఇచ్చింది. సర్కులర్ లో తప్పు వచ్చినందుకు విచారం వ్యక్తం చేసింది.
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారు ఈ ఉద్యోగాలు అర్హులు అని, పాస్ అయిన సంవత్సరంతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. కరెక్షన్ చేసిన సర్కులర్ ని మళ్లీ షేర్ చేసినట్టు హెచ్ డీఎఫ్ సీ తెలిపింది. కాగా, ఈ సర్కులర్ పై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. పరీక్షలు లేకుండా పాసై కరోనా బ్యాచ్ గా ముద్రవేయించుకున్న విద్యార్థులు ఎందుకూ పనికిరాకుండా పోతున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని వాపోతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more