One CRPF jawan injured in J-K's Shopian terrorist attack జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ లో ఉగ్రదాడి.. జవాన్‌కు గాయాలు

One crpf jawan injured in j k s shopian terrorist attack

CRPF jawan injured, Jammu and Kashmir CRPF jawan injured, CRPF, Shopian, Jammu and Kashmir, National politics

One Central Reserve Police Force (CRPF) jawan was injured after, terrorists on Tuesday attacked CRPF road opening party at Kralcheck Zainapora in Shopian. More details are awaited.

జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ లో ఉగ్రదాడి.. జవాన్‌కు గాయాలు

Posted: 08/10/2021 11:38 AM IST
One crpf jawan injured in j k s shopian terrorist attack

జమ్మూకాశ్మీర్లో మరో విధ్వంసానికి ఉగ్రవాదులు తెరలేపారు. మరోసారి భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి చేయాలని రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్‌ బలగాలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్‌ గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలోని జైన్ పోరాలోని క్రాల్ చక్ ప్రాంతంలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది. స్థానిక చెక్ పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న భారత సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఉద్రవాదలు కాల్పులతో రెచ్చిపోయారు.

అన్యూహ్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జవాన్ అజయ్ కుమార్ చేతికి బుల్లెట్ గాయమైందని, చికిత్స అనంతరం కోలుకుంటున్నాడని వైద్యులు పేర్కొన్నారు. కాగా ఉగ్రవాదులు కాల్పుల నేపథ్యంలో హుటాహుటిన స్పందించిన భారత భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురుకాల్పులు జరిపాయి. అనంతరం ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టి వారి కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఘటనా స్థలంలో జవాన్లకు తూటాలు లభ్యమయ్యాయి. కాగా అప్పటికే అక్కడి నుంచి ఉగ్రవాదులు పరారయ్యారు.

దీంతో భారత బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశాయి. ఉగ్రవాదులు అక్కడే నక్కివున్నారని.. వారిని ఎలాగైనా అదుపులోకి తీసుకోవాలని కార్డన్ పర్చ్ నిర్వహిస్తున్నాయి. కాగా.. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కాశ్మీర్‌లో మంగళవారం నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. మాతా ఖీర్ భవానీ ఆలయాన్ని, హజ్రత్‌బల్ దేవాలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. శ్రీనగర్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా.. సోమవారం అనంత్‌నగర్‌ జిల్లాలో బీజేపీ సర్పంచ్‌తో పాటు అతని భార్యపై కాల్పులు జరుపడంతో ఇద్దరూ మృతి చెందారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles