ఎనమిదేళ్లుగా ఒకే జిల్లాలో పాతుకుపోవడం అతని అవినీతికి కొత్త బాష్యం చెప్పేలా చేసింది. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మరీ ఓ అధికారి అమ్యామ్యాల కోసం నయాదారిని వెతుక్కున్నాడు. అధికారి ఆగడాలు నానాటికీ శృతిమించిపోవడంతో తట్టుకోలకపోయిన దుకాణాదారులు అతనిపై అవినీతి నిరోధకశాఖ అధికారులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఏసీబి అధికారులు యధావిధిగా లంచాలు తీసుకువెళ్లేందుకు అధికారి రావడంతో లంచంగా తీసుకున్న డబ్బుతో పాటు రెడ్ హ్యండెండ్ గా పట్టుకున్నారు. అధికారి నివాసంలోనూ సోదాలు నిర్వహించారు.
కాగా, ఏ నెలలో ఏ దుకాణాదారుడు ఎంతెంత ముడుపులు చెల్లించుకోవాలో పేర్కోంటూ ఈ అధికారి ఎంచుకున్న నయాదారి వాట్సాప్ గ్రూప్. మండలంలోని దుకాణాదారులతో కూడిన వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి మరీ లంచాలు వసూలు చేస్తున్న మండల వ్యవసాయాధికారి తంతు తెలిసి ఏసీబీ అధికారులు నివ్వెరపోయారు. ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇవ్వరాదని ఓ వైపు విపరీతంగా ప్రచారం చేస్తున్నా.. అధికారులు మాత్రం అమ్యామ్యాల కోసం అర్రులు చాస్తుండటం విస్తుగొలుపుతుందని ఏసీభి అధికారులు పేర్కోన్నారు.
ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో నార్లపాటి మహేశ్‌చందర్ ఛటర్జీ 8 సంవత్సరాలుగా మండల వ్యవసాయాధికారి (ఏవో)గా పనిచేస్తున్నారు. లంచాల రుచిమరిగిన ఆయన ఎరువులు, పురుగుమందుల దుకాణాల యజమానుల నుంచి ముడుపులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. తాను తనిఖీలు నిర్వహించకుండా ఉండాలంటే నెల నెలా ముడుపులు సమర్పించుకోవాలంటూ ఏకంగా వాట్సాప్ గ్రూపునే ఏర్పాటు చేశారు. ఈ నెలలో ప్రతి దుకాణం రూ. 15 వేల చొప్పున ఇవ్వాలంటూ మెసేజ్‌లు పంపారు. ఇక దీంతో పాటు ఇద్దరు వ్యక్తులతో కలసి మండల పరిధిలో పరోక్షంగా ఎరువుల దుకాణాన్ని కూడా ప్రారంభించాడు.
ఓ వైపు లంచాలు తీసుకుంటూనే మరోవైపు వ్యాపారం కూడా చేయిస్తున్న మండల వ్యవసాయ అధికారి వేధింపులు భరించలేని వ్యాపారులు గత నెల 30న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ అధికారుల సలహా మేరకు ఆరు దుకాణాల నుంచి సేకరించిన సొమ్మును తీసుకునేందుకు రావాలంటూ దుకాణదారులు ఏవోను కోరారు. నిన్న చంద్రుగొండ రైతు వేదికలో యజమానుల నుంచి రూ. 90 వేల లంచం సొమ్ము తీసుకుంటుండగా వల పన్నిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదే సమయంలో అశ్వారావుపేటలోని ఆయన స్వగృహంలోనూ సోదాలు నిర్వహించారు. ఏవోపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more