"Within 48 Hours Of...": A Supreme Court Move To Decriminalise Politics అభ్యర్థుల నేరచరిత్రను రాజకీయ పార్టీలే బయటపెట్టాలి: సుప్రీంకోర్టు

Parties must publish criminal antecedents of candidates within 48 hours of selection sc

Supreme Court, Decriminalise Politics, criminal records of poll candidates, Political parties, Bihar Assembly Elections, criminal background, Crime

Political parties must make criminal records of their poll candidates public within 48 hours of their selection, the Supreme Court said today, in a big step towards decriminalising politics. In a move to stop state governments from misusing their powers, the court also said criminal cases against MLAs or MPs cannot be withdrawn without approval from High Courts.

అభ్యర్థుల నేరచరిత్ర బయటపెట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలదే: సుప్రీంకోర్టు

Posted: 08/10/2021 01:19 PM IST
Parties must publish criminal antecedents of candidates within 48 hours of selection sc

 దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రాజకీయ పార్టీల‌కు నూతనంగా మరో బాధ్యతను తాజాగా అప్పగించింది. ఈ మేరకు అత్యున్న‌త న్యాయ‌స్థానం గతంలో ఇచ్చిన తీర్పును మర్చుతూ కీల‌క ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని ఏదేని స్థానానికి ఇకపై జరిగే ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటించిన తరువాత రాజకీయ పార్టీలే తమ అభ్యర్థుల నేరచరిత్రను బయటపెట్టాలని అదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక జరిగిన కేవలం 48 గంటల వ్యవధిలో వారి క్రిమినల్ రికార్డును కూడా రాజకీయ పార్టీలే ప్రజలకు తెలియజేస్తూ బహిర్గతం చేయాలని అదేశాలను జారీ చేసింది.

రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంటు స్థానాలకు జరిగే ఎన్నిక‌ల్లో అభ్యర్థులను ఎంపిక చేయడమే గగనంలా అనిపించే రాజకీయ పార్టీలకు ఇకపై మరో అదనపు బాధ్యత కూడా చేపట్టాల్సి వుంది. గతంలో అభ్యర్థుల నేరచరిత్రను ఎన్నికల కమీషన్ బహిర్గతం చేయాలన్న వాదనలతో పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే ఈ పిటీషన్లను విచారించిన న్యాయస్థానం ఎన్నికల కమీషన్ కు బదులు..  అభ్యర్థులే తమ నేరచరిత్రను ప్రజలకు తెలియజేయాలని గత ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అదేశించింది. కాగా తాజాగా జ‌స్టిస్ ఆర్ఎఫ్ నారీమ‌న్‌, జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్‌ల‌తో కూడి ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేర‌కు గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 13న తాము ఇచ్చిన తీర్పులో మార్పులు చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌తంలో ఇచ్చిన తీర్పు మార్చుతూ.. అభ్యర్థులకు బదులు రాజకీయ పార్టీలే త‌మ అభ్య‌ర్థుల క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టాల్సిందిగా సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టంచేసింది. త‌మ అభ్య‌ర్థుల క్రిమిన‌ల్ రికార్డుల‌ను బ‌య‌ట‌పెట్టని పార్టీల గుర్తుల‌ను ర‌ద్దు చేయాల్సిందిగా కోరుతూ దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంగా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇక మరో పిటీషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర హైకోర్టులకు తెలియకుండా ఏదేని ఎమ్మెల్యే, ఎంపీలపై కొనసాగుతున్న కేసులను ఉపసంహరించరాదని అత్యున్నత న్యాయస్థానం అదేశాలు జారీ చేసింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles