కరోనా మహమ్మారి మరోమారు యావత్ ప్రపంచాన్ని వణించనుంది. ఈ సారి రూపాన్ని మార్చుకున్న కరోనా.. డెల్టా వేరియంట్ తో విజృంజనుందా.? అంటే ఔనని చెప్పక తప్పదు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలలో డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో డెల్టా వేరియంట్ బారిన పడి బాధితురాలు మరణించిందని.. అమెకు సోకింది డెల్టా ప్లస్ వేరింయట్ అని అధికారులు స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రలో డెల్టా వేరియంట్ తో మరణించిన రోగుల సంఖ్య మూడుకు చేరింది.
తాజాగా రాయ్ గడ్ జిల్లాకు చెందిన 69 ఏళ్ల వ్యక్తికి డెల్టా ప్లస్ వేరియంట్ సోకింది. రెండు డోసుల వాక్సీన్ తీసుకున్నా అతనికి కరోనా సోకడం గమనార్హం. జూలై 27న డెల్టా వేరియంట్ తో ఒక మహిళ చనిపోయారని అధికారులు తెలిపారు. గత నెల 21క 63ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడ్డారని, అమె మధుమేహంతో పాటు ఇతర రుగ్మతలతోనూ బాధపడుతుందని తెలిపారు. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న తరువాత కూడా అమెకు కరోనా సోకిందని అధికారులు గుర్తించారు.
దీంతో అమెలో టీకాలు వృద్దిచేసిన యాంటీబాడీలు ఏమయ్యాయని అధికారులు విస్మయం చెందారు. కాగా ఆమె నుంచి సేకరించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ నివేదిక రావడంతో అమెతో సన్నిహితంగా మెలిగిన వారి జాబితాపై అధికారులు అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటికే అమెతో క్లోజ్ గా వ్యవహరించిన మరో ఇద్దరికి కూడా కరోనా డెట్లా ప్లస్ వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. కాగా, మరణించిన 63 ఏళ్ల కరోనా డెల్టాప్లస్ వేరియంట్ రోగికి మాత్రం ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు తెలిపారు.
ఇక కరోనా సోకిన నేపథ్యంలో సదరు బాధితురాలికి ఆక్సీజన్ తో పాటు ట్రీట్ మెంట్ చేశారని, రెమ్ డెసివీర్ ఇంజక్షన్లతో పాటు స్టెరాయిండ్స్ కూడా చికిత్సలో భాగంగా ఇచ్చామని, అయినా అమె కొలుకోలేదని వైద్యులు తెలిపారు. దీంతో డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమని వినబడుతున్న వార్తల్లో నిజం లేకపోలేదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఈ మహిళ మృతితో మహారాష్ట్రలో కరోనా డెల్టా వేరియంట్ తో మరణించిన వారి సంక్య మూడుకు చేరింది. గత నెలలో రత్నగిరకి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు ఆ వేరియంట్‌కు బలయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more