ప్రముఖ బాలీవుడ్ నటీ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీనటి గెహనా వశిష్ట్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ముంబై సెషన్స్ కోర్టు తిరస్కరించింది. అమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. గెహనా వశిష్ట్ పై మోపబడిన అభియోగాలు తీవ్రమైనవని పేర్కొంది. పోలీసు కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపింది. గెహనాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి సరైన ఆధారాలేమి లేవని కోర్టు అభిప్రాయపడింది.
అశ్లీల వీడియోల చిత్రీకరణలో ఫిర్యాదు చేసిన 21ఏళ్ల యువతిని బెదిరించటంలో గెహనా పాత్ర కీలకమని పోలీసులు కోర్టుకు విన్నవించారు. గతంలోనూ ఇలాంటి కేసులోనే తాను అరెస్ట్ అయినట్టు గెహనా కోర్టుకు తెలిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు గెహనా ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఫిబ్రవరిలో ఇదే కేసులో తనను అరెస్టు చేశారని, జూన్‌లో బెయిల్ మంజూరు చేసినట్లు ఆమె కోర్టుకు తెలిపింది. తనకు సంబంధించిన లాప్‌ట్యాప్, ఫోన్లను క్రైమ్ బ్రాంచ్ సీజ్ చేసిందని గెహనా పేర్కొంది.
గత ఫిబ్రవరి నెలలో మొదటి సారిగా పోర్నోగ్రఫీ కేసులో గెహనాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత గెహనా బెయిల్‌పై విడుదల అయింది . రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో గెహనాపై మరోసారి కేసు నమోదైంది. ఇటీవలే.. పోర్నోగ్రఫీ కేసులో నటి గెహనా వశిష్ట్ ఇన్వాల్వ్ అయిందంటూ మల్వానీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. గెహనా తనను బెదిరించి.. తనతో న్యూడ్, సెమీ న్యూడ్ సీన్ల చిత్రీకరణ చేయిందిందని ఓ బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more