పంజాబ్ లోని పాటియాలా నగరంలో ఓ కారు డ్రైవర్ చేసిన పని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు కుట్రలకు ప్లాన్ చేశారన్న నిఘా వర్గాల సమాచారంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ విధుల్లో భాగంగా శనివారం కూడా పాటియాలాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏ వాహనాన్ని కూడా వదలకుండా అన్ని వాహనాలను తనిఖీలు చేస్తున్నారు పోలీసులు.
ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారును అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. అయితే కారు డ్రైవర్ పోలీసు కానిస్టేబుల్ ను గమనించి కారును వేగంగా ముందుకు తీసాడు. దీంతో కానిస్టేబుల్ అడ్డుగా వెళ్లగా వేగంగా.. ఆపకుండా కానిస్టేబుల్ మీదకు దూసుకొచ్చాడు. చేసేది లేక కానిస్టేబుల్ తప్పుకునేందుకు ప్రయత్నించాడు.అయినా అందుకు కూడా అవకాశం ఇవ్వని కారు డ్రైవర్.. వాహనాన్ని వేగంగా ముందుకు నడిపించాడు. కారును అపేందుకు వచ్చిన కానిస్టేబుల్ పరిస్థితి ఎలా వుందన్న విషయం కూడా పట్టించుకోకుండా ఢీకొట్టి పారిపోయాడు.
ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కారు వేగంగా ముందుకు దూసుకురావడంతో తప్పించుకునే ప్రయత్నంలో ఆయన కిందపడ్డాడు. ఎలాగోలా ముందు టైర్ నుంచి తప్పించుకున్నా.. వెనక టైరు మాత్రం ఆయన కాలిపై నుంచి పోకింది. ఆయన ఎడమ కాలు ఫ్రాక్చర్ అయ్యిందని స్థానికులు తెలిపారు. తోటి పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఓ కారు డ్రైవర్ తనిఖీ నుంచి తప్పించుకునేందుకు తమ పోలీస్‌ను ఢీకొట్టి కారుతో పరారయ్యాడని, ప్రస్తుతం ఆ కారును ట్రేస్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పాటియాలా డీఎస్పీ హేమంత్ శర్మ చెప్పారు. కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతున్నదన్నారు.
#WATCH Car evading security check hits police personnel in Patiala, Punjab
— ANI (@ANI) August 14, 2021
Police say the injured police personnel is under medical treatment, car traced, further investigation underway
(Video source: Police) pic.twitter.com/ZF9wygy8Xm
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more