తెలంగాణ రాజకీయం మొత్తం ప్రస్తుతం దళితబంధు పథకం చుట్టూ తిరుగుతోంది. ఎన్నికలకు వ్యూహరచనలు చేసి.. ఓటర్లను తనవైపు ఆకర్షితుల్ని చేయడంలో నిష్ణాతులైన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. తన చేతిలోని అధికారాన్ని చేజారిపోనీయకుండా ఉండేందుకు ఇప్పటికే పలు ప్రణాళికలను రచించారు. టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో నిలిచిన తనకు పోమ్మనకుండా పోగబెట్టారంటూ స్వయంగా ఈటెల అరోపించారు. తనకు ఉద్యమం నేపథ్యంలో లభించిన ప్రాధాన్యత.. పార్టీ అధికారంలో దక్కటేదని కూడా అరోపించారు.
ఉద్యమంతో పుట్టికోచ్చిన పార్టీలో వారసత్వం లేదని నాయకులదే ఫైచేయి అంటూ ఉద్యమ నేపథ్యంలో పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రస్తుతం ఉద్యమద్రోహులను పార్టీలో చేర్చుకుంటూ తెలంగాణ ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని కూడా ప్రశ్నించారు. ఇక ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఓడించి పార్టీలో తన అధిపత్యానికి ఎలాంటి అడ్డు లేదని చాటేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. హుజూరాబాద్ లో ఉపఎన్నికలకు సిద్దమవుతున్న క్రమంలో దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు కేసీఆర్.
ఈ పథకంలో భాగంగా ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయనున్నారు. ఎల్లుండి హుజూరాబాద్ సభలో కొందరు లబ్ధిదారులకు కేసీఆర్ చెక్కులను అందించనున్నారు. మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు కొందరికి మాత్రమే కాకుండా దళిత కుటుంబాలన్నింటికీ ఒకేసారి సాయాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తూ హూజురాబాద్ లో దళితుల ధర్నాకు దిగారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నేతలు దళితబంధు పథకాన్ని ప్రశంసించారు. మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యానారాయణ ఈ జాబితాలో వున్నారు. కాగా సొంత పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాత్రం దళితబంధు పథకంపై సంచలన కామెంట్లు చేశారు. దళితబంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టమని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more