ఫిట్నెస్ పరీక్షలో విఫలమయ్యే వాహనం ఇకపై స్ర్కాప్ యార్డుకు తరలుతుంది. సర్లే తరువాత తీసుకెళ్తాం అనే అవకాశం కూడా వాహనదారుడికి ఆర్టీఏ అధికారులు ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే నూతన స్ర్కాపేజీ విధానం ప్రకారం మూడు పర్యాయాలు ఫిట్ నెస్ పరీక్షల్లో వాహనం ఫెయిల్ అయితే వెంటనే దానిని తుక్కుగా మార్చేస్తారు. ఈ మేరకు కేంద్రం కార్యాచరణ మొదలుపెట్టింది. 1 ఏప్రిల్ 2023 నుంచి వాణిజ్య వాహనాలు, 1 జూన్ 2024 నుంచి వ్యక్తిగత వాహనాలకు ఇది వర్తిస్తుంది. కొత్త విధానంలో భాగంగా వాహనాలన్నీ తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో కనుక విఫలమైతే వాహనాలను తుక్కు కింద మార్చేస్తారు.
ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. ఫిట్నెస్ పరీక్షలో కనుక వాహనాలు విఫలమైతే నెల రోజుల్లోపు మరో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత కూడా విఫలమైతే వారం రోజుల్లోపు అప్పీలు చేసుకోవచ్చు. అక్కడ కూడా ఫిట్నెస్ పరీక్షలో విఫలమైతే నమోదిత కేంద్రంలో వాహనాన్ని తుక్కు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో 15 ఏళ్ల సర్వీసు పూర్తయిన వాహనాలు కోటికిపైనే. వీటిని తుక్కు చేయడమే కొత్త విధానం ఉద్దేశం. వాటి స్థానంలో కొత్త వాహనాలు వస్తే భద్రత పెరగడంతోపాటు ఇంధనం, నిర్వహణ ఖర్చులు ఆదా అవుతాయి.
అంతేకాకుండా ఈ విధానం వల్ల కొత్తగా 35 వేల ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వానికి రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఇక కొత్త విధానంలో కొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత వాహనం రిజిస్టర్డ్ స్క్రాపింగ్ సెంటర్‌కు వెళ్తే వాహన యజమానికి డిపాజిట్ ధ్రువపత్రం లభిస్తుంది. కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దానిని చూపిస్తే రిజిస్ట్రేషన్ రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది. వ్యక్తిగత వాహనాలకైతే రోడ్డు ట్యాక్స్‌పై 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం రాయితీ లభిస్తుంది. వాణిజ్య వాహనాలకు 8 సంవత్సరాల వరకు, వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల వరకు ఈ రాయితీ లభిస్తుంది. ప్రతి జిల్లాలోను ఓ తుక్కు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more