ఒక్క ఏడాదిలో ప్రధాని మంత్రి నరేంద్రమోది గ్రాఫ్ పూర్తిగా దిగజారిపోయింది. గత ఏడాది 66 శాతంగా వున్న ఆయన పాపులారిటీ ఈ ఏడాది తాజాగా విడుదలైన సర్వేలో ఏకంగా 24కు దిగజారింది. ఏడాది వ్యవధిలో ఆయన పాపులారిటీ గ్రాప్ ఏకంగా 42 శాతం కోల్పోయింది. కరోనా మహమ్మారి రెండో దశ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో పాటు కరోనా లాంటి కఠోర సమయాల్లోనూ ఆయన ప్రభుత్వం పేదలపై భారం మోపుతూ ఇంధన ధరలతో పాటు సబ్సీడీ గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
‘ఇండియా టుడే’ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ ముఖ్యమంత్రి 19 శాతం ఓట్లతో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దాస్ అగ్రస్థానంలో నిలిచారు. అయితే, యోగీ అదిత్యనాథ్ పాపులారిటీ గ్రాప్ కూడా ఆరు మాసాల వ్యవధిలో ఆరుశాతం మేర దిగజారింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే ఆయన పాపులారిటీ కూడా తగ్గింది. జనవరిలో నిర్వహించిన మూడ్ అప్ ది నేషన్ లో 25 శాతం మేర వున్న ఆయన పాపులారిటీ కాస్తా తాజా సర్వే సమయానికి 19 శాతానికి పరిమితం అయ్యింది.
ఇక యోగి అధిత్యనాథ్ తరువాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 14 శాతం ఓట్లతో రెండోస్థానంలో, 11 శాతం ప్రజాదరణతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ మూడో స్థానంలో నిలిచారు. ఇక గతేడాది నిర్వహించిన ఇదే సర్వేలో ‘బెస్ట్ సీఎం’గా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ గ్రాఫ్ ఈసారి పడిపోయింది. బోల్డన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆయనకు సరైన ఆదరణ లభించకపోవడం గమనార్హం. ఇక, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను స్వరాష్ట్ర ప్రజలు బెస్ట్ సీఎం అంటూ కీర్తించారు. ఆ రాష్ట్రంలో 42 శాతం మంది ఆయనకు ఓట్లేసి అగ్రస్థానాన్ని కట్టబెట్టారు.
అలాగే స్వరాష్ట్రంలో ప్రజాదరణలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (38శాతం), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (35శాతం) రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ‘మోస్ట్ పాప్యులర్ సీఎమ్స్ ఇన్ దెయిర్ హోమ్ స్టేట్స్’ టాప్-10 జాబితాలో కూడా ఏపీ సీఎం జగన్ పేరు కనిపించలేదు. టాప్-10 జాబితాను మాత్రమే వెల్లడించడంతో జగన్ స్థానం ఎంతన్నది తెలియరాలేదు. అలాగే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా టాప్ టెన్ జాబితాలో లేదు. మరోవైపు, జాతీయ స్థాయిలోనూ జగన్కు ఆదరణ తగ్గినట్టు ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో వెల్లడైంది.
గతేడాది ఇదే సర్వేలో జాతీయ స్థాయిలో జగన్ బెస్ట్ సీఎం అంటూ 11 శాతం మంది ఓట్లేయగా, ఈసారి ఆ సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఆరు శాతం మంది మాత్రమే ఆయనకు అనుకూలంగా ఓట్లేశారు. ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో భాగంగా 19 రాష్ట్రాల పరిధిలో 115 లోక్సభ నియోజకవర్గాలు, 230 అసెంబ్లీ స్థానాల్లో గత నెల 10-20 తేదీల మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తంగా 14,599 మంది అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 71 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారు కాగా, 29 శాతం మంది పట్టణ ప్రాంతాలకు చెందినవారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more