తెలుగు రాష్ట్రాలలో వరలక్ష్మీ వత్ర శోభ సంతరించుకుంది. శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున హిందూ వివాహిత మహిళలు ఎంతో భక్తిశ్రద్దలతో వరలక్ష్మీ వత్రాన్ని జరుపుకోవడం పరిపాటి. దీంతో మహిళలు వేకువ జామునే లేచి అమ్మవారి వత్రం చేసుకునేందుకు ఇళ్లు వాకిళ్లు శుభ్రం చేసి.. ఆవు పేడతో కల్లాపి చల్లి.. అందంగా ముగ్గులు వేసి.. కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారిని ఆహ్వానించేందుకు సిద్దం అవుతున్నారు. ఇవాళ ఘనంగా వరలక్ష్మీ పూజ చేసిన ముతైదువలు.. తమ బంధుమిత్రులను ఇళ్లకు అహ్వానించి వారికి వాయినం (తాంబులం) ఇస్తారు.
వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించడమే వరలక్ష్మీ వ్రతం. సర్వసాధారణంగా మహిళలు ఏ శుక్రవారం రోజున తమ ఇళ్లలోంచి పసుపు కుంకుమలను బయటకు వెళ్లనివ్వరు.. కానీ ఇవాళ మాత్రం అమ్మవారి వత్రం అచరించిన తరువాత వారే ఇరుగుపోరుగు వారితో పాటు బంధుమిత్రులను పిలిచి పాదాలకు పసుపు రాసి.. కుంకుమ బోట్టు పెట్టిన తరువాతే వాయినాలను అందిస్తారు. ఇలా చేయడం ద్వారా తమ సౌభాగ్యాలకు, సుఖ సంతోషాలకు ఏఢాది వరకు ఎలాంటి ఢోకా వుండదని భక్తుల విశ్వాసం.
మామిడి ఆకుల తోరణాలు, పూలను గుమ్మాలకు కట్టి.. తరువాత అమ్మవారిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో అక్కడ అరటి ఆకులు, మామిడి ఆకులు, పూలు, తోరణాలతో ఆలకరించి.. లక్ష్మీ దేవి అమ్మవారికి ప్రీతికరమైన ఎరుపు వర్ణం పూలతో పీఠాన్ని ఆలంకరిస్తారు. గణపతి పూజతో వ్రతం ప్రారంభించిన తరువాత.. కలశస్థాపన ద్వారా లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకుని ఆతరువాత వత్రం చేస్తారు. షోడషోపచార పూజలతో పాటు వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి, లలితా సహస్రనామాలు, లక్ష్మీదేవి స్త్రోత్తాలు పఠించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు.
అనంతరం ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తారు. సర్వోపచారాలు చేసిన తర్వాత కంకణాలు కట్టుకుంటారు. అనంతరం చేతుల్లో అక్షింతలు తీసుకొని వరలక్ష్మీ వ్రతకథ (చారుమతి కథ)ను చదవిన తరువాత ఆ అక్షింతలను వారి శిరసుపై వేసుకోవడంతో పాటు కుటుంబసభ్యుల శిరసులపై కూడా వేస్తారు. అమ్మవారికి నీరాజనం సమర్పించిన తరువాత ఇంట్లోని పెద్దలకు పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఆ తరువాత ఇంటికి వచ్చిన బంధుమిత్రులు, ఇరుగుపోరుగు వారికి వాయినాలను ఇస్తారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వివాహితలు ఆచరించే ఈ వత్రాలతో పండుగ శోభ సంతరించుకుంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more