ఓ సూపర్ మార్కెట్ లోకి అనుకోని అతిధి వచ్చింది. షాపింగ్ చేస్తున్న ఓ మహిళా కస్టమర్ కు షాకిచ్చింది. అదేంటి సూపర్ మార్కెట్లోకి అనుకోని అతిథి వస్తే మహిళా కస్టమర్ ఎందుకు షాక్ కు గురయ్యారంటారా.? సూపర్ మార్కెట్ లోకి వచ్చిన అనుకోని అతిథి మరెవరో కాదు ఏకంగా పది అడుగుల మేర ఉన్న కొండచిలువ. మార్కెట్ కు వచ్చిన కస్లమర్లతో పాటు, సిబ్బందిని కూడా కాసేపు కంగారు పెట్టించింది. దీంతో కొంతసేపు సూపర్ మార్కెట్లో సిబ్బందితో పాటు కస్టమర్లు కూడా కొంత కలవరానికి గురయ్యారు.
సిడ్నీ నగర శివారల్లోని వాయువ్య ప్రాంతంలోని గ్లినోరీలో వున్న చెయిన్ సూపర్ మార్కెట్ సంస్థ వూల్ వర్త్స్.. స్టోర్ ఉంటుంది. ఆ సూపర్ మార్కెట్ హిలైనా అలేటి అనే మహిళ షాపింగ్ చేసేందుకు బ్రౌసింగ్ చేస్తోంది. ఇంతలో తన వంటగదిలోకి కావాల్సిన మసాలా, పప్పు దినుసులు తీసుకునేందుకు అవి వున్న ప్రాంతానికి చేరుకుంది. అయితే అప్పటికే అక్కడున్న కొండచిలువ అమెను చూసింది. కానీ అమె దానిని గమనించలేదు. ఇంతలో ఏదో శబ్దం కావడంతో అమె వెంటనే వెనక్కు తిరిగింది. ఇంతలో ఏకంగా ఆ కొండ చిలువ ఏకంగా ఎనమిది ఇంచుల ముందుకు వచ్చి తన తలను బయటకు పెట్టింది.
దీంతో కంగారుపడిన అమె.. వెంటనే తేరుకుని.. దానిని పట్టుకుంది. ఒ బ్యాగులో దానిని వేసి.. తరువాత దానిని సమీపంలోన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టింది. ఈ సందర్భంగా హిలైనా అలేటి మాట్లాడుతూ.. తాను దానిని చూడగానే భయపడ్డానని, అయితే తాను స్వయంగా విషపూరిత పాములను పట్టుకునేందుకు శిక్షణ పోందిన క్రమంలో దానిని పట్టుకున్నానని, తెలిపింది. అయితే అది విషపూరితమైన కొండచిలువ కాదని.. అది డైమండ్ పైథాన్ అని తెలిపింది. అది స్టోర్ లో స్పైస్ జార్లు ఉంచే సెల్ఫ్ లో కనిపించిందని తెలిపింది. తానును భయపడలేదు.. కానీ సడెన్ గా కనిపించే సరికి కొంత షాక్ అయ్యానని ఆమె చెప్పింది. అయితే సూపర్ మార్కెట్ లోకి పాము ఎలా వచ్చిందో తెలియడం లేదు. సూపర్ మార్కెట్ లో పాముకి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more