కరోనా మహమ్మారి రెండో విడత నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ముగించి అన్ లాక్ ప్రారంభం కాగానే ఇంధన ధరలకు రెక్కలు రావడం.. అసలే కష్టకాలంలో వున్న ప్రజలపై పిడుగు పాటులా పెట్రోల్, డీజీల్ సహా గ్యాస్ ధరల పెంపు పడింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజుల పాటు నిలకడగా వున్న ధరలు.. ఫలితాలు వెలువడి.. బీజేపికి చెంపపెట్టులాంటి ఫలితాలను అందించడంలో.. ధరలకు ఏ మాత్రం కళ్లెం లేకుండా పోయింది. ఇక ప్రతిపక్షాలు పలు పర్యాలు దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఈ మధ్యకాలంలో ధరలు కాసింత స్థిరంగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో దేశంలో ఎనబై రూపాయల మార్కు దాటగానే ప్రతిపక్షంలో ఉండగా గగ్గోలు పెట్టిన బీజేపి.. ఇప్పుడు ఆ ధర దేశంలో ఎక్కడా కనిపించకుండా చేసింది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటగా.. సామాన్యులు పెరిగిన ఇంధన ధరలతో బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు డీజిల్ ధర కూడా పెరగడంతో దాని ప్రభావం టోకు ధరల ద్రవ్యోల్బణంపై కూడా పడింది. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రశ్నించిన మీడియాపై మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెట్రోల్, డీజిల్ తక్కువ ధరకు కావాలంటే తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్లండి.. అక్కడ చౌకగా పెట్రోల్ దొరుకుతుంది’ అంటూ మండిపడ్డారు.
పెరిగిన పెట్రోల్ ధరలపై కట్నీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామ్‌రతన్ పాయల్‌ను ప్రశిస్తే.. ‘తాలిబన్ పాలిత ప్రాంతానికి వెళ్లిపో. అక్కడ పెట్రోల్ రూ.50కే దొరుకుతుంది’ అంటూ వ్యాఖ్యానించారు. ఇంకా మాట్లాడుతూ దేశంలో కరోనా రెండు వేవ్‌లో వచ్చాయని.. మూడో వేవ్ రాబోతుందన్నారు. దేశంలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో మీకు తెలుసా? అంటూ ఎదురు ప్రశ్నించారు. బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ నేతల వాక్చాతుర్యం కొనసాగుతుందని.. వారికి దేవుడు జ్ఞానం ఇవ్వాలని పేర్కొంది. ఇదిలా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.84 ఉండగా.. డీజిల్ ధర రూ.89.27 పలుకుతోంది.
#BREAKING : BJP #Katni, #MadhyaPradesh district president Ramratan Payal responding to a question on inflation and on expensive petrol in #India, urges to go to #Afghanistan, there petrol is 50 rupees litre, but no one is there to purchase it.
— Sushmit Patil Сушмит Патил सुश्मित पाटिल (@PatilSushmit) August 19, 2021
BTW What about cooking oil? pic.twitter.com/jR8lZ4xO1I
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more