ఒక్కక్క సందర్భంలో ఇది ఖచ్చితంగా వైరల్ అవుతుందని భావించి పోస్టు చేసిన వీడియోను నెటిజనులు పెద్దగా పట్టించుకోరు. అయితే దాంతో చాలా భాదపడతారు వీడియోను పోస్టు చేసిన వాళ్లు. అయితే ఇప్పుడు వైరల్ కానీ వీడియోలు ఎప్పుడో ఒకప్పుడు మాత్రం తప్పకుండా సంచలనంగా మారుతుంది. టైం వస్తే చాలు..అదృష్టం కూడా ఒకదాని వెంట మరోకటి తాకుతూ ఎక్కడెక్కడికో తీసుకెళ్తుందని అన్నట్లు... పాత వీడియోలు కూడా మిలియన్ వ్యూవ్ దాటి వైరల్ అవుతుంటాయి. అదెలా అంటే అందుకు ఈవీడియోనే ఉదాహరణ.
సెప్టెంబర్ 30న 2016లో పోస్టు చేసిన ఓ వీడియో.. అప్పట్లో పెద్దగా వ్యూవ్ రాబట్టలేకపోయింది. అయితే క్రమంగా ఇప్పుడు మాత్రం ఏకంగా కోటి మందికి పైగా వీక్షకులు ఈ వీడియోను చూశారు. అందునా ఇది సర్వసాధారణమైన వీడియో కాదు. ఏకంగా గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించిన వీడియో. చైనాలోని వూహాన్ వేదికగా జరిగిన ఓ వేడుకలో మలేషియాకు చెందిన ఇద్దరు మెజీషియన్లు చేసిన అద్భుతానికి సంబంధించిన వీడియో ఇది. ఎవ్వరూ చేయలేని పని చేస్తే.. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేని పనిని చేసి రికార్డులను అందుకోవడమే దీని సారాంశం.
మలేషియాకు చెందిన ఇద్దరు మెజీషియన్లు ఒకే ఒక్క నిమిషంలో కళ్లు బైర్లు కమ్మెలా ఏకంగా 18 డ్రెస్సులు మార్చింది. ఒక వ్యక్తి తనను క్లోజ్‌గా ఉండే ఒక క్లాత్ లాంటి దాన్ని అడ్డం పెడుతూ.. పైకీ కిందికీ అంటూ ఉంటాడు. దాన్ని కిందికి అన్నప్పుడల్లా డ్రెస్ మారుతుంటుంది. గ్రాఫిక్స్‌లో కలర్స్ మార్చినంత ఈజీగా.. క్షణాల్లో ఆ యువతి.. డ్రెస్‌ను మార్చుతుంటుంది. అలా.. ఒక్క నిమిషంలో ఎక్కువ డ్రెస్‌లను మార్చుకొని ఆ యువతి.. గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటికే ఏకంగా 10 మిలియన్ వ్యూవ్స్ క్రాస్ చేసింది. మరెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండీజ..
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more