Police raids again Teenmaar Mallanna House and QNews office మరోమారు తీన్మార్ మల్లన్న ఇళ్లు, కార్యాలయంపై పోలీసుల సోదాలు

Police once again raid teenmaar mallanna house and qnews office

Teenmaar Mallanna, Q News Office, Police Raids, CM KCR, Srinivas Goud, Corruption, Telangana Rashtra Samithi, TRS social media convenor Krishank, Youtube channel, Cybercrime police, Telanagana, politics, Crime

Popular political activist and journalist Chintapandu Naveen Kumar alias Teenmaar Mallanna, has landed in yet another case. Hyderabad Cyber Crime Police Raids again the House of Teenmaar Mallanna and his Q News Office, just after three weeks when they allegedly raided Q news Office.

మరోమారు తీన్మార్ మల్లన్న ఇళ్లు, కార్యాలయంపై పోలీసుల సోదాలు

Posted: 08/26/2021 12:21 PM IST
Police once again raid teenmaar mallanna house and qnews office

తీన్మార్ మల్లన్నగా  తెలంగాణ ప్రజలకు సుపరిచుతుడైన ప్రముఖ జర్నలిస్ట్.. అలియాస్ చింతపండు నవీన్‌ కు చెందిన యూట్యూబ్ చానెల్ క్యూ న్యూస్ కార్యాలయంతో పాటు అతని ఇంటిపై కూడా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల నేపథ్యంలో పోలీసులు క్యూ న్యూస్ కార్యాలయంలోని కంపూటర్ల హార్డ్ డిస్క్ లు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కొద్దిపాటి మెజారిటీతో ఓటమిని చవిచూసిన తరుణంలో ఆయనపై పోలీసుల కేసులు నమోదు కావడం.. ఆయన కార్యాలయాలపై పోలీసుల దాడులు జరగడం పరిపాటిగా మారింది.

నెల రోజుల వ్యవధిలో రెండో పర్యాయం మల్లన్న ఇంటి, కార్యాలయాలపై సైబర్ క్రైం పోలీసులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలను తీసుకెళ్లారని సమాచారం. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో ఓ వైపు ఈటెలను టార్గెట్ చేసిన అధికార పక్షం.. అదే తరహాలో ఇటు తీన్మార్ మల్లన్నను కూడా టార్గెట్ చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను బాతాల పోశెట్టి, సన్నాసి అంటూ అసంబధ్దంగా సంబోధిస్తూ.. ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారని టీఆర్ఎస్ పార్టీకి చేందిన సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు కంప్యూటర్లు, 40 హార్డ్ డిస్కులతోపాటు పలు ధ్రువపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ముఖ్యమంత్రి చెంప పగులగొట్టాలి అని అన్నందుకే కేంద్రమంత్రి నారాయణ్ రాణేను అరెస్టు చేయగలిగినప్పుడు.. ముఖ్యమంత్రిని అసంబద్దంగా, అగౌరవంగా, అమర్యాదగా సంబోధించిన వ్యక్తి కూడా అరెస్టు కావాల్సిందేనని క్రిషాంక్ మీడియాతో అన్నారు. ఈ క్రమంలో పోలీసులు బౌడుప్పల్ లోని ఆయన కార్యాలయంలో దాడులు చేసి కంప్యూటర్ హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో ఆయన కార్యాలయంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు మీసాలు పెట్టి ఉన్న ఫోటోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అటు ఆయన ఇంటిపై కూడా ఏకకాలంలో పోలీసులు దాడులు చేశారు. మల్లన్నపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తాను పోలీసులన కోరినట్టు క్రిషాంక్ తెలిపారు. దీంతో త్వరలో పాదయాత్ర చేసి కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు వివరించి చెప్పాలని సంకల్పించిన మల్లన్నకు బ్రేక్ పడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles