ఆన్లైన్ మోసాలను ఎదుర్కోవడానికి వాట్సాప్ అనేక భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుని మోసాలకు పాల్పడుతూనే వున్నారు. వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్న కొత్త స్కామ్ వర్క్ ఫ్రం హోమ్ (ఇంటి నుంచే పనిచేసే) ఆఫర్ మెసేజ్. పార్ట్ టైమ్ ఉద్యోగాలు అందించే మెసేజ్ వాట్సాప్ సహా ఏకంగా మేసేజెస్ ఇన్ బాక్సుల్లోకి కూడా వస్తోంది. ఇది తమకు కష్టకాలంలో అందిన లాభసాటి ఆఫర్ల అనుకుంటే మీరు బోల్తా పడినట్టే. ఎందుకంటే ఇది కూడా సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ.
భారతదేశవ్యాప్తంగా చాలా మందికి ఈ వాట్సాప్ లేదా మేసేజ్ ఇన్ బాక్సుల్లోకి ఈ సందేశం వచ్చింది. దీనిని ఓపెన్ చేయగానే పార్ట్ టైమ్ ఉద్యోగం గురించి ఉండటంతో అందునా.. రోజుకు 30 నిమిషాలు మాత్రమే పని చేయడం ద్వారా రోజుకు రూ. 200 నుంచి రూ .3000 వరకు ఆదాయం లబిస్తోందని ఉండటంతో అనేక మంది సంతోషించారు. ఇక ఉద్యోగం కోసం రిజిస్టర్ చేసుకోగానే కొత్త కస్టమర్లు రూ .50 పొందుతారని కూడా సందేశం చెబుతోంది. సందేశం క్రింద లింక్ అందించబడింది. ఇది నిజమని బావించిన లింక్ నొక్కి మీ డీటైల్స్ సమాచారం ఎంటర్ చేస్తే.. మీ అకౌంట్లో వున్న డబ్బుకు పోయినట్టే. లేదా మీ వ్యక్తిగత సమాచారం చోరుల చేతికి చిక్కుతుంది.
అదెలా అంటే.. పేరుతో పలకరించిన సైబర్ నేరగాళ్లు ఒకే రోజులో 7.20 లక్షలను కొట్టేశారు. తీరా మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు రాచకొండ సైబర్కైం పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళను తన పేరుతో పలకరించి బురిడి కొట్టించిన వైనం కూడా ఇలానే జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మౌలాలీ ప్రాంతానికి చెందిన బాధితురాలికి ఈ నెల 22న తన ఫోన్‌కు హై అంజనా అంటూ ఓ ఎసెమ్మెస్ వచ్చింది. అందులో అమెజాన్ సంస్థ అత్యవసరంగా పార్ట్-టైం ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తుంది. దీంతో రోజుకు రూ.3 వేల నుంచి 10 వేల వరకు సంపాదించవచ్చని ఓ లింక్‌ను ఇచ్చారు.
ఆ లింక్‌ను బాధితురాలు క్లిక్ చేయగా.. నేరుగా వాట్సాప్ గ్రూపులోకి వెళ్లింది. అక్కడ బాధితురాలు హై అని టైప్ చేసింది. రిప్లెగా ఫ్లిప్‌కార్ట్-మెయిల్ పేరుతో ఓ సమాచారం వచ్చింది. కేవలం స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉంటే మీరు టాస్క్‌ను పూర్తిచేసి చాలా డబ్బులు సంపాదించవచ్చని చెప్పి మరో లింక్‌ను ఇచ్చాడు. ఆ లింక్‌ను క్లిక్ చేసి అందులో బాధితురాలు రిజిస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఆమెను రూ.200 పెట్టుబడి పెట్టమన్నాడు.
దీంతో ఫోన్‌పే నుంచి రేజర్ పేమెంట్ గేట్‌వే ద్వారా లింక్ పంపిన వ్యక్తికి పంపింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతాకు రూ.400 వచ్చాయి. దీంతో నమ్మకం పెరిగి ఈ నెల 24న బాధితురాలు ఒకే రోజులో దాదాపు 7.20 లక్షలను పెట్టుబడిగా పెట్టింది. లాభం డబ్బు ఆమెకు కనిపిస్తుంది. కానీ విత్‌డ్రా చేసుకోవడానికి రావడంలేదు. మోసపోయానని బాధితురాలు సైబర్ కైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పేరుతో పలకరించే సమాచారం వచ్చినప్పుడు అవి నిజమైనవిగా నమ్మకండి ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మన ఫోన్ నంబర్లను పలు ఏజెంట్ల ద్వారా కొనుగొలు చేసి ఈ విధంగా మోసానికి పాల్పడతారని సైబర్కైం అధికారులు హెచ్చరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more