న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చి బాధిత మహిళకు పరిహారం అందించాలని పలుమార్లు చెప్పినా.. కోర్టుల తీర్పులను అమలుపర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి.. కోర్టు ధిక్కారానికి పాల్పడిన ఐదుగురు ఐఏఎస్ అధికారులపై హైకోర్టు సంచలన అదేశాలను జారీ చేసింది. కోర్టు ధిక్కారానికి పాల్పడటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఐదురుగు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించింది. అంతేకాదు వారి వేతనాల్లో కూడా కోత విధించి పరిహారం చెల్లించాలని కూడా అదేశాలను జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ అదేశాలను అములుపర్చాల్సిన ఐఏఎస్ అధికారులపై న్యాయస్థానం ఇంతలా కన్నెర చేయడానికి వారి నిర్లక్ష్యమే కారణం. అయితే ఈ మేర అదేశాలను జారీ చేసిన న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రోన్నత న్యాయస్థానమే కావడం గమనార్హం. ఇక ఐదుగురు ఐఏఎస్ అధికారులు కూడా రాష్ట్రానికి చెందిన వారే కావడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళ నుంచి భూమి తీసుకుని పరిహారం అందించని ఐఏఎస్ అధికారులపై న్యాయస్థానం ఈ మేరకు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశించినా పరిహారం చెల్లింపులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ మండిపడిన కోర్టు.. ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్ష, జరిమానాను విధించింది.
నెల్లూరు జిల్లా తాళ్లపాకకు చెందిన సాయి బ్రహ్మ అనే మహిళకు సంబంధించిన భూ పరిహారం కేసుపై హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ కు జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానాను విధించింది. నాటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుకు రెండు వారాలు, ఐఏఎస్ అధికారి ఎస్.ఎస్. రావత్ కు నెల రోజులు, ముత్యాల రాజుకు రెండు వారాలు, మరొక ఐఏఎస్ కు రెండు వారాల జైలు శిక్షను విధించింది. అందరికీ రూ.వెయ్యి చొప్పున జరిమానా వేసింది. శిక్షపై అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువునిచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more