ఆన్ లైన్ గేమ్ ఆడితే పిల్లల మనత్వత్వంపై తీవ్రప్రభావం పడుతుందని ఇప్పటికే ప్రముఖ సైకాలజిస్టులు చెబుతున్నారు. వారిలో నేరప్రవృత్తిని పెంచడంతో పాటు.. మానసికంగా కూడా ప్రభావితుల్ని చేస్తుందని చెబుతున్నారు. అయినా కొందరు తల్లిదండ్రులు పిల్లలకు సెల్ ఫోన్లను కొనిచ్చి.. గేమ్స్ ఆడనిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆన్ లైన్ గేమ్లను అత్యధికంగా మార్కెట్ చేసిన చైనా లాంటి దేశాలే ఇప్పుడు చిన్నారుల ఆన్ లైన్ గేమ్ లను నియంత్రిస్తూ కొత్త విధివిధానాలను తీసుకువస్తున్నాయి. వారానికి కేవలం మూడు గంటల సమయం మాత్రమే ఆన్ లైన్ గేమ్స్ కోసం కేటాయించాలే తప్ప అంతకుమించితే చర్యలు తప్పవని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయితే మన దేశంలో మాత్రం చిన్నారులకు ఇలాంటి అంక్షలేమీ అమలు కావడం లేదు.
దీంతో ఆ గేమ్ ఎంతపని చేసిందో తెలుసా..? నిత్యం అన్ లైన్ గేమ్ అడుతున్నాడని ఓ తండ్రి తన కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేయండంతో.. ఆ నిండు కుటుంబం విషాదాదంలోకి నెట్టివేయపడింది. తల్లిని ఒంటరిని చేసింది. తండ్రి తిరిగిరాని లోకాలకు వెళ్లగా, కొడుకు మాత్రం చిన్నవయస్సులోనే కారాగారవాసం చవిచూసేలా చేసింది. గంట ముందువరకు సంతోషంగా వున్న కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. మొబైల్ ఫోన్లో గేమ్ ఆడటంపై తండ్రి తిట్టడంపై ఆ కోడుకు తన తండ్రి గొంతు నొక్కి హత్య చేశాడు. గుజరాత్లోని సూరత్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఘటన పలువురు తల్లిదండ్రులతో పాటు ఆన్ లైన్ గేమ్ అడే చిన్నారులను కూడా అలోచనలో పడేసింది.
అసలేం జరిగిందంటే.. ఒక వ్యక్తిని ఇచ్ఛాపూర్లోని న్యూ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు చెప్పారు. ఆసుపత్రి సిబ్బంది దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చిన పోలీసులు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడని ఆరా తీశారు. బాత్ రూమ్లో జారిపడి మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు ఆ వ్యక్తి మృతదేహానికి గురువారం పోస్ట్మార్టం నిర్వహించారు. గొంతునొక్కడం వల్ల అతడు మరణించినట్లు పోస్ట్మార్టం రిపోర్టులో వైద్యులు పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఆ కుటుంబాన్ని ప్రశ్నించగా 17 ఏండ్ల బాలుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు. మొబైల్లో గేమ్ ఆడుతున్న తనని తండ్రి తిట్టాడని, ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిందని తెలిపాడు. తాను గొంతునొక్కడంతో తన తండ్రి చనిపోయినట్లు చెప్పాడు. దీంతో బాలుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువెనైల్ హోమ్ కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more