husband forces wife to wear short dresses పోట్టి దుస్తులు వేసుకోమ్మని భార్యను వేధిస్తున్న భర్త..

Psycho husband harasses wife and forces to wear short dresses

mohammad farhan, Psycho husband, short dresses, gold ornaments, cash, discountinued studies, ayesha osman, banjara hills police station, domestic violence, crime

A psycho husband harasses wife by forcing her to wear short dresses at home in front of him takes pictures of her in semi nude, He doesnt allows her to go out of home.. blackmails her to post her pics in social media.

పోట్టి దుస్తులు వేసుకోమ్మని భార్యను వేధిస్తున్న భర్త..

Posted: 09/04/2021 06:39 PM IST
Psycho husband harasses wife and forces to wear short dresses

పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు నిలబడి ఫొటోలు తీసుకోవాలని భర్త వేధింపులు.. చదువు మానేసి ఇంట్లో కూర్చుని వంట పని నేర్చుకుంటూ అత్తామామల సూటిపోటి మాటలు.. ఇలా మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్న భర్తకు అత్తామామలు కూడా తోడయ్యారు. దీంతో ఆ భార్య వారికి బుద్దిచెప్పాలని నిర్ణయించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.11లో నివాసముండే యువతి ఎంబీఏ పూర్తి చేసింది. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంపై ఆసక్తి ఉండటంతో కోర్సులో చేరింది. అదే సమయంలో సికింద్రాబాద్‌లోని గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న మహ్మద్‌ ఫర్హాన్‌(26) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

ఇరు వర్గాల సమ్మతితో పెండ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో రూ.కోటిన్నర విలువైన ఆభరణాలు, వస్త్రాలు, ఇతర సామగ్రితో పాటు ఖరీదైన బహుమతులు అందజేశారు. పెండ్లి అయిన తర్వాత చదువు మానేసి ఇంట్లో ఉండాలని అత్తామామలు ఒత్తిడి తేవడం ప్రారంభించారు. చిన్న చిన్న దుస్తులు వేసుకోవాలని, లోదుస్తులతో తన ముందు నడవాలంటూ.. వాటిని ఫొటోలు, వీడియోలు తీసుకోవడం చేస్తున్న భర్త ఫర్హాన్‌ తీరుపై బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసేది. అయితే తాను చెప్పినట్లు వినకపోతే తీసిన వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తానని తరుచూ బెదిరించేవాడు.

ఆమె ఖరీదైన ఆభరణాలు మొత్తం అత్త అయేషా ఉస్మాన్‌ తన వద్ద పెట్టుకున్నది. ఎప్పుడు అడిగినా లాకర్లో ఉన్నాయని, ఖరీదైన ఆభరణాలు వేసుకుని జనం దృష్టిలో పడవద్దంటూ చెప్పేది. రెండేళ్లయినా పిల్లలు కాకపోవడంపై సూటిపోటి మాటలతో వేధింపులు ఎక్కువ కావడంతో ఈనెల 8న ఇంట్లోంచి వెళ్లేందుకు సిద్ధపడిన బాధితురాలు.. తన సామాన్లు సర్దుకునేందుకు ప్రయత్నిస్తుండగా, అవి కనిపించలేదు. రూ.1.8లక్షల నగదుతో పాటు రూ.కోటిన్నర విలువైన ఆభరణలు, దుస్తులు, ఇతర బహుమతులను ఇవ్వకపోగా బయటకు పంపించేశారు. దీంతో ఆమె బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితులు ఫర్హాన్‌, అతడి తల్లి అయేషా ఉస్మాన్‌, మామ ఉస్మాన్‌పై గృహహింసతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles