Florida shooting: Shooter kills 4, including infant అగ్రరాజ్యంలో కాల్పులకు తెగబడిన మాజీ సైనికుడు..

Florida shooting ex us marine suspected of killing four including a baby

Florida shootout, infant killed, 4 killed in Gun Firing, Bryan Riley, former US marine, Lakeland, Tampa, florida, US-shootout, America, crime

A former US marine has shot and killed four people in Florida, including a woman and her three-month-old baby boy in her arms, before surrendering, acccording to police. The shooter, alleged by police to be Bryan Riley, 33, a former US marine, also allegedly wounded an 11-year-old girl in a shootout in Lakeland near Tampa in central Florida

అగ్రరాజ్యంలో కాల్పులకు తెగబడిన మాజీ సైనికుడు.. నలుగురు మృతి

Posted: 09/06/2021 01:26 PM IST
Florida shooting ex us marine suspected of killing four including a baby

అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ దుండగుడు ఉన్మాదిలా మారి నలుగురి ప్రాణాలను బలిగొన్నాడు. ఈ కాల్పుల ఘటనలో అభంశుభం తెలియని చంటిబిడ్డతో పాటు నలుగురు మరణించారు. ప్రశాంతంగా వున్న ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పులకు తెగబడి జనాన్ని భయభ్రాంతులకు గురిచేశాడు. ఫ్లోరిడాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్లోరిడాకు చేరువలోని తంప ప్రాంతంలోని లేక్ ల్యాండ్ లో ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు.. తన తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా తుపాకి గురిపెట్టి ఇంట్లోని వారిపై కాల్పులు జరిపాడు.

తుపాకీ గుళ్ల గాయాలతో నెత్తురోడుతున్న ఓ పదకొండేళ్ల చిన్నారి కాపాడండీ, అంటూ అరుపులు వేస్తూ రావడాన్ని గమనించిన స్థానిక పోలీసులు అమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా, అమె తమ ఇంట్లో మరో ముగ్గరు దారుణంగా కాల్చిచంపబడ్డారని పోలీసులకు తెలిపింది. దీంతో చిన్నారిని అసుపత్రికి తరలించిన పోలీసులు.. ఇంట్లోకి వెళ్లి చూసేసరకి చంటిబిడ్డను (నెలల బాలుడు) ఎత్తుకన్న 33 ఏళ్ల మహిళతో పాటు చిన్నారి శిశువు కూడా దుండగుడు తుపాకీ కాల్పులతో బలితీసుకున్నాడు.

చిన్నారి తండ్రి జస్టసి్ గ్లీసన్ ను కూడా దుండగుడు కాల్చిచంపాడు. అయితే మరో 60 ఏళ్ల మహిళ కూడా కొద్ది దూరంలో తుపాకీ గాయాలతో మరణించింది. అయితే అమె గ్లీసన్ తల్లిగా పోలీసులు భావిస్తున్నారు. అయితే పోలీసులను చూసిన దుండగుడు వారిపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడని, తరువాత లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడ్ని బ్రాండెన్ కు చెందిన బ్రేయిన్ జేమ్స్ రిలేగా గుర్తించిన పోలీసులు అతను అమెరికా మైరన్ రంగ సైనికుడిగా విధులు నిర్వహించి తరువాత పదవీ విరమణ పోందాడని తెలిపారు. అప్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలపై యుద్దంలోనూ పాల్గోన్నాడని, ప్రస్తుతం సెక్యూరిటీ గార్డుగా, బాడీగార్డుగా విధులునిర్వహిస్తున్నాడని తెలిపారు.

కాగా తమ విచారణలో మృతుటు తమ ప్రాణాల కోసం వేడుకున్నా తాను వారిని విముక్తుల్ని చేశానని నిందుతుడు చెప్పారని పోలీసుల తెలిపారు. నాలుగేళ్లుగా దుండగుడితో ప్రేమలో వున్న అతని గర్ల్ ఫ్రెండ్ మాత్రం నిందితుడు అప్పడప్పుడు మతిస్థిమితం కోల్పోతాడని తెలిపిందని పోలీసులు తెలిపారు. అయితే నాలుగేళ్లుగా ఇలా పలు పర్యాయాలు జరిగినా.. ఆయన ఎప్పుడు హింసాత్మకంగా వ్యవహరించలేదని అమె చెప్పింది. ఆర్లాండోలోని ఓ చర్చి వద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్న ఆయన.. గతవారం ఇంటికి చేరుకున్నాడని, వచ్చినప్పటి నుంచి తాను దేవుడితో స్వయంగా మాట్లాడుతానని చెప్పడని అమె తెలిపిందని పోలీసులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles