రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు, వైసీపీ నేత జయరామరెడ్డి ఓ కాంట్రాక్టర్ ను రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంట్రాక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్న ఆయన తన కారులోనే కూర్చోని.. కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. తాము చె్ప్పినట్టు నడుచుకోకపోతే బౌతికదాడులు తప్పవని హెచ్చరించడంతో పాటు.. యంత్రాలను కూడా ధ్వంసం చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
అవినీతి లేని పాలనను అందిస్తామని ఓ వైపు వైఎస్సార ఫార్టీ అధినేత జగన్ అధికారంలోకి రాకముందు చేసిన ప్రకటనకు.. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలు చేస్తున్న హెచ్చరికలకు మధ్య అస్సలు పోంతనలేదన్న విమర్శలు వినబడుతున్నాయి. రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 17 కోట్ల నిధులు మంజూరు చేసింది. ద్వారకామాయి కన్స్ ట్రక్ క్షన్స్ (డీఎంసీ) అనే సంస్థ కాంట్రాక్టును సొంతం చేసుకుని పనులు ప్రారంభించింది.
విషయం తెలిసిన జయరామరెడ్డి కాంట్రాక్టర్ సిబ్బందిని కలసి టెండర్ వేసిన తరువాత కతలసి సర్ధుకుపోదాం అని చెప్పిన కాంట్రాక్టర్.. చెప్పకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని కాంట్రాక్టర్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులెలా చేస్తారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తనను మాట్లాడుకొమ్మన్నారని.. తనతో మాట్లాడకుండా, తనకు తెలియకుండా పనులు ఎలా చేస్తారన్నారు. తమ మనుషులు వస్తున్నారని... ఒక్క సైగ చేస్తే మొత్తం పగులగొట్టి పోతారన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more