Triangular love story solved out with lottery చర్చిలో కీచక పాస్టర్.. రెండో భార్య పిర్యాదుతో కేసు

Pastor held on dowry harassment rape charges

church pastor, Gospel Church, sexual assault, staff nurse, Sandhya, Sadu Chinna Venkateshwarlu, Boduppal, rebecca, marital disputes, dowry harassment, Medipally ps, Rachakonda Police, Telangana, Crime

A church pastor was arrested by the Medipally police on Monday on charge of repeatedly sexually assaulting a 24-year-old woman on the promise of marriage and later refusing to tie the knot on flimsy grounds.

చర్చిలో కీచక పాస్టర్.. రెండో భార్య పిర్యాదుతో కేసు

Posted: 09/06/2021 06:56 PM IST
Pastor held on dowry harassment rape charges

ప్రార్ధన చేయడానికి చర్చికి వచ్చే యువతులే అతడి టార్గెట్. దేవుని సన్నిధిలో ఉండే అతి పవిత్రమైన వృత్తిలో వుండి ప్రార్థనలు చేసే వ్యక్తి ప్రవృత్తిలో మాత్రం కీచక అవతార ఎత్తాడు. చర్చీకి వచ్చి భగవంతుడికి తమ బాధను వ్యక్తం చేసే క్రమంలో వారిని గమనించిన పాస్టర్ వారి బాధలు పోవాలంటే తప్పకుండా ప్రత్యేక పార్థనలు చేయాలని.. ఇలా ఒక్కోక్కరిని ఒక్క చోటకు తీసుకెళ్లి నిర్జన ప్రాంతాలలో వారిపై అఘాయిత్యాలకు పాల్పడి.. తాను వారిని పెళ్లి  చేసుకుంటానని నమ్మబలికాడు.

పాస్టర్ కదా నిజంగా తమను పెళ్లి చేసుకుంటాడని నమ్మిన యువతులను.. అదే అబద్దం చెబుతూ మళ్లీ మళ్లీ పాల్పడి.. తీరా ఒత్తిడి పెరిగన క్రమంలో ఏవో కారణాలు చెప్పి తప్పిచుకున్నాడు. అయితే ఇలా అమ్మాయిలకు గాలం వేస్తూ లోబర్చుకునే క్రమంలో ఓ యువతి నిలదీయండంతో విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేసిన సదరు పాస్టర్.. అవివాహితుడు అనుకుంటే పోరబాటే. ఈయనగారిపై ఆయన రెండో భార్య ఇచ్నిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఉప్పల్ గాస్పల్ చర్చిలో జోసెఫ్ అనే వ్యక్తి పాస్టర్ గా పేరు మార్చుకున్న సాధు చిన్న వెంకటేశ్వర్లు.. దేవున్ని ప్రార్థిస్తూ పాపాలను పక్షాళన చేస్తానని చెప్పుబుతూ.. అతడే పాపపు పనులకు పూనుకున్నాడు. పాస్టర్ ముసుగేసుకున్న ఈ వంచకుడు చర్చికి వచ్చే అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లోబర్చుకునేవాడు. ఇలా ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న జోసెఫ్ మరికొందరు ఆడపిల్లలను కూడా ట్రాప్ చేసి మోసగించాడు. స్థానిక ఆసుపత్రిలో  పనిచేసే ఓ యువతి అతని మాయమాటలను నమ్మి మోసపోయింది.

దీంతో తనను వివాహం చేసుకోమ్మని అమె అతన్ని నిలదీసింది. అయితే ఏవో కారణాలు చెప్పిన పాస్టర్ అమెను పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. దీంతో అమె అతని గురించి పూర్తి వివరాలు సేకరించింది. అతని పేరు సాధు వెంకటేశ్వర్లు అని. అతనికి 2011లోనే సంధ్య అనే యువతితో వివాహం జరిగిందని, వీరికి ఓక ఆడ బిడ్డ సంతానం కూడా కలిగిందని తెలుసుకుంది. అయితే అనారోగ్య కారణాల వల్ల అమె చనిపోయిందని తెలుసుకుంది. కాగా, 2015లో రెబెకా అనే మరో మహిళను రెండో వివాహం కూడా చేసుకున్నాడని, వీరికి ఒక మగ సంతానం కూడా కలిగిందని అయితే అమెను వరకట్నం వేధింపులతో పాటు గృహహింసకు కూడా గురిచేశాడని తెలుసుకుంది.

దీంతో అమె పాస్టర్ జోసెఫ్ అలియాస్ సాధు వెంకటేశ్వర్లుపై మేడిపట్లి పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ క్రమంలో రెండవ భార్యకు దృష్టికి భర్త లైంగిక వేధింపుల విషయం తెలియడంతో ఇన్నాళ్లు తనను వేధించినా నిమ్మకుండిన అమె.. ఇప్పుడు వచ్చి పోలీసులకు తన భర్త తనను వరకట్నం తీసుకురావాలని శారీరికంగా, మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు పిర్యాదు చేసింది. దీంతో మేడిపల్లి పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఇలా అమె కేసు నమోదు చేసిన తరువాత పాస్టర్ పై పలువురు యువతులు కూడా తమను పెళ్లి చేసుకుంటానని  నమ్మబలికి తైంగికదాడికి పాల్పడ్డాడని పిర్యాదు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles