తీన్మార్ మల్లన్నగా తెలంగాణ ప్రజలకు సుపరిచుతుడైన ప్రముఖ జర్నలిస్ట్.. అలియాస్ చింతపండు నవీన్ కు చెందిన యూట్యూబ్ చానెల్ క్యూ న్యూస్ కార్యాలయంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఇవాళ మరోమారు దాడులు నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆయన కొద్దిపాటి మెజారిటీతో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమిని చవిచూసిన తరుణంలో ఆయనను అధికార పార్టీ టార్గెట్ చేసి అరెస్టు చేసిందన్న అరోపణలు వెలువెత్తిన విషయం తెలిసిందే.
డబ్బుల కోసం తీన్మార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్.. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్‌శర్మ ఏప్రిల్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్ లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి తన ప్రతీష్టకు భంగం కలిగిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని లక్ష్మీకాంత్‌శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో కొత్తగా అంబర్ పేట్ శంకర్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇద్దరి మధ్య తాను రాజీ కుదర్చిన మాట నిజమేనని ఆయన అంగీకరించారని సమాచారం.
ఈ క్రమంలో క్యూ న్యూస్ కార్యాలయంలో సీసీఎస్ పోలీసులు మరోమారు సోదాలు నిర్వహించారు. ఆయన కార్యాలయంపై దాడులు చేయడం వరుసగా ఇది మూడో సారి. కార్యాలయంలోని 10 కంప్యూటర్లు, 15 హర్డ్ డిస్క్‌లు, కేబుల్ పత్రాలు, పుస్తకాలు తీసుకెళ్లినట్లు సమాచారం. గత నెల 27 నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ చంచలగూడ జైలులో ఉన్నారు. పీర్జాదిగూడ కెనరానగర్ సమీపంలోని ప్రజా క్లినిక్ నిర్వాహకుడు డాక్టర్ ఇమ్మానేయల్ ను పోలీసులు విచారించారు. మల్లన్నకు గతంలో కరోనా సోకగా ఈ వైద్యుడి వద్ద చికిత్స పొందినట్లు తెలియడంతో ఆయన్ను పోలీసులు రహస్యంగా విచారించి వైద్యం వివరాలు సేకరించినట్లు తెలిసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more