oneplus nord 2 5g blasts in coat of a delhi lawyer కోర్టులో పేలిన స్మార్ట్ ఫోన్.. లీగల్ ఫైట్ కు సిద్దమైన న్యాయవాది

Oneplus nord 2 5g blasts in coat of a delhi lawyer in tees hazari court

Oneplus nord, Oneplus, Delhi lawyer, Gaurav Gulati, 5G phone explode, Tees Hazari Court, Legal battle, bomb explosion, phone caught fire, Delhi, Crime

Delhi-based lawyer Gaurav Gulati's new OnePlus Nord 25G exploded. "My phone caught fire when I was in my chamber," said Gaurav Gulati. The incident took place in Delhi's Tees Hazari Court. It exploded like a bomb after the phone caught fire. I saw smoke coming out of my coat pocket.

కోర్టులో పేలిన స్మార్ట్ ఫోన్.. లీగల్ ఫైట్ కు సిద్దమైన న్యాయవాది

Posted: 09/15/2021 10:49 AM IST
Oneplus nord 2 5g blasts in coat of a delhi lawyer in tees hazari court

అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవంతో ప్రస్తుతం ప్రజలు జేబుల్లో బాంబులు పెట్టుకుని తిరుగుతున్నట్లుగా వుంది. ఎవరో ఎక్కడో బాంబు పెట్టారంటేనే అక్కడి నుండి పరుగులు తీసే ప్రజలు.. ఏకంగా తమ జేబుల్లోనే బాంబులు పెట్టుకుని సంచరిస్తున్నారంటే విస్మయం చెందాల్సిన అవసరం లేదు. అయితే బాంబులు ఎక్కడ పెట్టుకున్నాం అని ప్రశ్నిస్తున్నారా.? మీరు డబ్బు పెట్టి మరీ కొన్న మీ అత్యంత అమూల్యమైన స్మార్ట్ ఫోనే మీచేత్తో పట్టుకునే బాంబు.. మీరు జేబులో పెట్టుకునే బాంబు అన్న విషయం మీకు తెలుసా.? నిజమే. ఈ మధ్యకాలంలో ఎందరో స్మార్ ఫోన్ వినియోగదారులు వేలకువెల రూపాయలు ధారపోసి కొంటున్న ఫోన్లు బాంబుల మాదిరిగా పేలిపోతున్నాయి.

ఎంత ఖరీదు పెట్టి కొన్నా ఒక్కోసారి ఫోన్లు బాంబుల మాదిరిగా పేలిపోతుంటాయి. ఈ పేలుళ్ల కారణంగా కొందరు గాయాల పాలవుతుండగా, మరికోందరు ఏకంగా ప్రాణాలే వదిలేస్తున్నారు. పది రూపాయలు పెట్టి కొనే ఆకుకూరలు తాజాగా లేదని అంక్షలు పెట్టి మరీ రైతులను దాబాయించి అరకొరగా తీసుకునే ప్రజలు.. అద్దాల మేడల్లోని షోరూమ్ లోకి వెళ్లి మరీ వేలకు వేల రూపాయలు పెట్టి మరీ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేస్తే.. అవి కొన్నాళ్లకు బాంబుల మాదిరిగా పేలిపోతున్నాయి, ఆ పేలేది ఇంట్లోనా.. ఆఫీసులోనా లేక షాపులోనా అన్న విషయం ఫోన్లను కొనుగోలు చేసిన వ్యక్తులకే కాదు ఫోన్లతో పాటు వాటిని తయారు చేసిన వారికి కూడా తెలియదు.

తాజాగా ఓ కోర్టుహాలులో ఓ కేసు విచారణ సాగుతోంది.  ఓ న్యాయవాది కూడా ఈ కేసు విచారణకు హాజరై కోర్టులో తనకు కేటాయించిన కుర్చీలో అసీనులైవున్నాడు. సీరియస్ గా విచారణ జరుగున్న సమయంలో ఆయన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ ఢాం అని పేలిపోయింది. దీంతో ఆ ఓ లాయర్ కు గయాలయ్యాయి. దీంతో ఆ లాయర్ ఆ ఫోన్ సంస్థపై న్యాయపోరాటం చేస్తానంటున్నారు. అది దేశ రాజధాని ఉత్తర ఢిల్లీలోని హజారీ కోర్టు. కోర్టులో ఓ కేసు గురించి విచారణ జరుగుతోంది. అదే సమయంలో న్యాయవాది గౌరవ్ గులాటి జేబులో ఉన్న వన్‌ప్లస్ నార్డ్-2 స్మార్ట్‌ఫోన్‌ నుంచి మంటలు చెలరేగాయి. అది గమనించిన గౌరవ్ వెంటనే ఫోన్ తీసి కింద పారేశాడు. ఆ వెంటనే కొన్ని క్షణాల్లోనే ఢాం అని శబ్ధం చేస్తూ పేలిపోయింది.

ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గౌరవ్ ఇటీవలే ఆ ఫోన్ కొన్నారు. ఎంతోకాలం అవ్వలేదు. ఈ ఘటనపై కాసేపటికి తేరుకున్న న్యాయవాది గులాటి మాట్లాడుతూ.. తాను వన్‌ప్లస్ నార్డ్-2 స్మార్ట్‌ఫోన్‌ ఇటీవలే కొన్నాను. కానీ అది పేలిపోయింది. కానీ వన్ ప్లస్ సంస్థను తాను సంప్రదించేది లేదు. ఆ సంస్థపై నేరుగా న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. ఈ ఘటనపై వన్‌ప్లస్ సంస్థ కూడా స్పందించింది. ఫోన్‌ను పరీక్షించకుండా పరిహారం చెల్లించలేమని వెల్లడించింది. ఫోన్ పేలిన ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవటానికి తాము న్యాయవాది గౌరవ్‌ను సంప్రదించామని కానీ ఆయన నుంచి మాకు ఎటువంటి స్పందన రాలేదని వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles