Maoist Dubashi Shankar Arrested In Odisha మావోయిస్టు ముఖ్యనేత దుబాసీ శంకర్ అరెస్టు..

Hardcore maoist dubashi shankar carrying rs 20 lakh bounty on head arrested

Top Maoist leader arrested in Odisha, Dubashi Shankar, Dubashi Shankar arrested in Odisha, Visakhapatnam, Odisha Police, Maoist leader, Dubashi Shankar arrested, Telangana, exchange of fire, Andhra-Odisha Border, Special Zonal Committee, AP Greyhounds, Andhra Pradesh, Crime

In a major success in the fight against Maoists, Odisha police have arrested a top Maoist leader Dubashi Shankar carrying Rs 20 lakh reward on his head, Odisha DGP Abhay said. Shankar is the highest-ranking Maoist to be arrested or neutralised in the past 20 years by the Odisha police, he said.

ఒడిశా పోలీసుల అదుపులో మావోయిస్టు ముఖ్యనేత దుబాసీ శంకర్

Posted: 09/15/2021 11:33 AM IST
Hardcore maoist dubashi shankar carrying rs 20 lakh bounty on head arrested

తెలంగాణకు చెందిన మావోయిస్టు కీలక నేత దుబాసి శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంకర్ ను పట్టించినా.. లేక అతను ఎక్కడున్నాడన్న సమాచారం అందించినా ఇరవై లక్షల రూపాయలను అందజేస్తామని ప్రకటించినా లభించని శంకర్.. కూంబింగ్ చేస్తున్న పోలీసులకు చిక్కాడు. దుబాసి శంకర్ అలియాస్ మహేందర్, అలియాస్ అరుణ్, అలియాస్ రమేశ్ గా పలు పేర్లతో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన శంకర్ పలు తీవ్రమైన కేసుల్లో అభియోగాలు ఎదుర్కోంటున్నాడు. ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కొరాపుట్, మల్కాన్‌గిరి, విశాఖపట్టణం జిల్లాల్లో మావోయిస్టు కీలక నేతగా ఉన్న శంకర్‌ను అరెస్ట్ చేసినట్టు ఒడిశా డీజీపీ అభయ్ తెలిపారు.

కూంబింగ్ లో భాగంగా నోయరో గ్రామంలో అరెస్ట్ చేసినట్టు చెప్పారు. అతడి నుంచి ఇన్సాస్ రైఫిల్, 10 రౌండ్ల బులెట్లు, ఇతర సామగ్రి, రూ. 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, శంకర్ తలపై రూ. 20 లక్షల రివార్డు కూడా ఉన్నట్టు డీజీపీ తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన శంకర్ 1987 నుంచే తీవ్రవాద ఉద్యమంలో ఉన్నాడు. 2016లో చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆయన భార్య భారతక్క మృతి చెందారు.  విశాఖపట్టణం జిల్లా తీగలమెట్టలో ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో అతడి హస్తం ఉన్నట్టు డీజీపీ తెలిపారు.

అలాగే, 2010లో గోవిందపల్లిలో మందుపాతర పేల్చి 11 మంది ఒడిశా పోలీసులను హతమార్చిన ఘటనలోను, చిత్రకొండలోని జానిగూడ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు బీఎస్ఎప్ జవాన్లు మరణించిన ఘటనలోను శంకర్ పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు. 2003 నాటికి మావోయిస్టు ఎస్‌జడ్‌సీ సభ్యుడి స్థాయికి ఎదిగిన శంకర్‌పై ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో 24 కేసులు నమోదైనట్టు చెప్పారు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న మావోయిస్టు నేతలు దుబాసి శంకర్, కిరణ్‌లను వెంటనే విడిచిపెట్టాలని ఏపీ పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles