దేశంలో పుడ్ డెలివరీ యాప్ లు వచ్చిన తరువాత నగరవాసుల్లో కాసింత బద్దకం ఎక్కువైంది. ఇన్నాళ్లు ఏదో ఒక హోటల్ కనిపిస్తే చాలు బోజనం చేద్దామనుకునే నగరవాసి.. ఇప్పుడు ఇంట్లోంచి అడుగు బయటపెట్టడానికి కూడా బద్దకిస్తూ.. ఆ బోజనమేదో అర్ఢర్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాడు. అయితే నగరవాసి బద్దకానికి ఇకపై చార్జీ పడనుంది. అదేంటి అంటారా.. ఇకపై ఫుడ్ డెలివరీ యాప్ ల ద్వారా తెప్పించుకునే ప్రతీ ఆహారంపై కేంద్రం జీఎస్టీని వడ్డించనుంది. ఇన్నాళ్లు ఎలాంటీ జీఎస్టీలు లేకుండా కోందరు.. ఇక అవకతవకలకు పాల్పడే మరికొందరు జీఎస్టీలను చెల్లించకుండా ఎగ్గోడుతున్నారని.. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ యాప్ లకు ఈ బాధ్యతను అప్పగించనుంది జీఎస్టీ మండలి.
దీంతో ప్రస్తుతం జొమాటో, స్విగ్గీ సహా ఇతర ఫుడ్ డెలివరీ సంస్థలే ఆర్డర్లపై జీఎస్టీ వసూలు చేస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. అయితే దీని వల్ల వినియోగదారులపై ఎటువంటి భారమూ పడబోదని వివరణ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జీఎస్టీ మండలి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ విషయంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు. కొత్త పన్నులేవీ లేవని వెల్లడించిన ఆమె.. ఫుడ్ ఆర్డరింగ్ సంస్థలే యూజర్ల నుంచి జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పారు.
ఇప్పటి వరకూ ఈ యాప్స్ అన్నీ కూడా టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) కింద నమోదై ఉన్నాయి. ఈ విషయంపై ఆర్థిక శాఖ సెక్రటరీ తరుణ్ బజాజ్ వివరణ ఇచ్చారు. ‘‘మనం ఒక యాప్ నుంచి ఆహారం ఆర్డర్ ఇస్తే.. దీనిపై జీఎస్టీని ఇప్పటి వరకూ రెస్టారెంట్లే చెల్లించాయి. అయితే కొన్ని రెస్టారెంట్లు ఈ పన్ను చెల్లించడం లేదు. అందుకే ఇక నుంచి సదరు యాప్స్ ఈ జీఎస్టీ వసూలు చేసి చెల్లించాలని నిర్ణయించాం’’ అని ఆయన తెలిపారు.
హర్యానాలోని కొన్ని రెస్టారెంట్లు చూపించిన లెక్కలకు, ఆ రెస్టారెంట్ల నుంచి ఈ యాప్స్ తీసుకున్న ఆర్డర్లకు లెక్కల్లో తేడా వచ్చినట్లు ఆర్థిక శాఖ అధికారులు గుర్తించారు. ఇలా ఆదాయం తక్కువగా చూపించిన కొన్ని రెస్టారెంట్లు పన్ను ఎగవేసినట్లు తరుణ్ చెప్పారు. ఈ క్రమంలోనే ఇకపై జీఎస్టీ వసూలు చేసి చెల్లించే బాధ్యతను ఈ ఫుడ్ ఆర్డరింగ్ యాప్స్కే అప్పగించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీంతో ఆతిధ్య రంగం నుంచి ఆశించిన మేరకు జీఎస్టీ వసూళ్లు వస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ అభిప్రాయపడింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more