శ్రీవారి భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పించేందుకు పెద్ద పీట వేసే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు.. కరోనా మహమ్మారి విజృంభించి నేపథ్యంలో శ్రీవారి భక్తలకు స్వామివారి దర్శనం కల్పించడంలోనూ అంక్షలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో తమకు తమ కొంగు బంగారమైన స్వామివారి దర్శనభాగ్యం కలగడం లేదంటూ ఎందరెందరో భక్తులు నిరాశ, నిసృహలకు గురవుతున్నారు. అయితే సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తు్న టీటీడీ శ్రీవారి భక్తుల కోసం బంఫర్ ఆపర్ ప్రకటించింది.
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వున్న వెనకబడిన ప్రాంతాలకు చెందిన శ్రీవారి భక్తులను ప్రత్యేకమైన బస్సుల ద్వారా తీసుకువచ్చి వారికి స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఇటీవల ఆలయాలు నిర్మించిన అన్ని జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాల నుంచి భక్తులను బస్సుల్లో ఉచితంగా తీసుకొచ్చి శ్రీవారి దర్శనం చేయించనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. అక్టోబర్ 7 దసరా శరన్నవరాత్రులలో భాగంగా స్వామివారికి నిర్వహించే బ్రహోత్సవాలను పురస్కరించుకుని ప్రతీ రోజు 500 నుంచి 1000 మంది స్వామివారి భక్తులను తీసుకువచ్చి స్వామివారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.
ఇందుకోసం విధివిధానాలు సిద్ధం చెయ్యాలని అధికారులను ఆదేశించామని టీటీడీ ఈవో జవహార్ రెడ్డి తెలిపారు. అలాగే, బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి కాలికనడక మార్గాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నప్రసాదాలు అందించాలని నిర్ణయించారు. ఇక, బ్రహ్మోత్సవాల్లో భాగంగా వచ్చే నెల 5న కోయిల్ అల్వార్ తిరుమంజనం, 6న అంకురార్పణ, 7న ధ్వజారోహణం, 11న గరుడ వాహన సేవ, 12న స్వర్ణరథం, 14న రథోత్సవం, 15న చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహించనున్నట్టు అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అక్టోబరు నెల రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) టికెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అలాగే, 24న ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేస్తారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more