కర్నాటక రాజధాని బెంగుళూరులో ఓ తెలుగు మహిళపై అఘాయిత్యం జరిగింది. అమెను తన స్నేహితురాలి ఇంటి నుంచి అమె ఇంటికి తీసుకెళ్లే క్రమంలో టాక్సీ డ్రైవర్ దారి మళ్లించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడే ముందుకు ఆమెతో ఆ డ్రైవర్ తన ఫోన్లో సెల్ఫీ దిగాడు. ఈ ఘటన ఇవాళ వేకువజామున జీవన్ బీమా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. అనుకోకుండా నిద్రలోకి జారుకన్న బాధితురాలు.. నిద్ర నుంచి తేరుకుని.. ఘటనాస్థలం నుంచి పరుగుతీసింది.
అయితే పరుగుపెట్టే ముందు అమె క్యాబ్ డ్రైవర్ పోన్ కూడా తీసుకుని వెళ్లి పోలీసులకు అందజేయడంతో క్యాబ్ డ్రైవర్ అమెతో సెల్పీ దిగిన విషయం బయటకు వెళ్లడైంది. ఈ కేసు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీకి చెందిన మహిళ తన ఫ్రెండ్ ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున 3.20 నిమిషాలకు క్యాబ్ బుక్ చేసుకున్నది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి ఆమె ఆ క్యాబ్‌లో తన ఇంటికి 3.40 నిమిషాలకు చేరుకున్నది. కానీ ఈ లోపే ఆ మహిళ క్యాబ్‌లోనే నిద్రలోకి జారుకున్నది. అయితే ఆ మహిళ ఇళ్లు సమీపించిన తర్వాత.. క్యాబ్ డ్రైవర్ డోర్ తీసేందుకు కారు వెనుక సీటుకు వచ్చి చూశాడు.
ఆ మహిళ నిద్రపోవడాన్ని గమనించిన ఆ డ్రైవర్.. నిర్జన ప్రదేశానికి తన కారును తీసుకువెళ్లి ఆమెతో సెల్ఫీ దిగాడు. ఆ తర్వాత అత్యాచారం చేశాడు. నిద్ర మత్తు నుంచి తేరుకున్న ఆ మహిళ .. క్యాబ్ డ్రైవర్‌ను తోసి వేసి పరుగులు తీసింది. క్యాబ్ డ్రైవర్ ఫోన్‌ను కూడా ఆ మహిళ పట్టుకువెళ్లింది. ఆ ఫోన్‌ను ఆమె పోలీసులకు అప్పగించింది. ఈ కేసును విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. లైంగిక దాడి జరిగినట్లు తెలుస్తోంది. మెడికల్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more