Man Promotes Covid Vaccination at Bus Stop వ్యాక్సిన్‌లపై యువకుడి వినూత్న ప్రమోషన్‌..

Chalo bhai vaccine vaccine man promotes covid vaccination at bus stop

viral video, covid vaccine, covid vaccination, vaccine video, hilarious video, funny video, trending video, Bus stand, Gujarat, Vaccination

To motivate people to get themselves vaccinated, many businesses and organisations have come up with lucrative campaigns and offers to persuade people. Now, a common man has taken it upon himself to urge people, in his own unique yet hilarious style.

ITEMVIDEOS: ఆటోవాలా అరిచినట్టే.. వ్యాక్సిన్‌లపై యువకుడి వినూత్న ప్రమోషన్‌..

Posted: 09/24/2021 05:30 PM IST
Chalo bhai vaccine vaccine man promotes covid vaccination at bus stop

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కేంద్రం వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చింది. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్లను విరివిగా అందజేస్తున్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ సెంటర్లలో వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. హైదరాబాద్‌ వంటి నగరాల్లో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో కూడా వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అనుకున్నంత లక్ష్యానికి చేరుకోవడం లేదు. ప్రభుత్వాలు ఎంతగా వేడుకుంటున్నా ప్రజలు అలసత్వం వీడటం లేదు.

ప్రజల్లో వ్యాక్సిన్‌ పట్ల అవగాహన కల్పించేందుకు గుజరాత్‌లో ఓ యువకుడు వినూత్న ప్రమోషన్‌ చేపట్టాడు. జనం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని.. వ్యాక్సిన్‌ వ్యాక్సిన్‌ అంటూ కూరగాయలు అమ్మినట్లుగా పెద్దగా అరుస్తున్నాడు. మొదటి డోసైనా, రెండోదైనా వ్యాక్సిన్‌ తీసుకోవాల్సిందే.. భయ్యా మీరు వ్యాక్సిన్ తీసుకోలేదా అయితే వెంటనే తీసుకోండి అంటూ వారిని మోటివేట్ చేస్తూ ఆకర్శిస్తున్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫన్నీ వీడియోకు ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ వ్యూస్‌ వచ్చాయి. నిద్రపోతున్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వాలని తాపత్రయపడిపోతున్న ఈ యువకుడికి హాట్స్‌ ఆఫ్‌ అంటూ ఒక నెటిజెన్‌ ప్రశంసించాడు.

 
 
 
View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY -mEmE pAgE- (@giedde)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles