మా గగనంలో మీరెవరూ అని అనుకుందో.. లేక తెల్లగా కనిపించే డ్రోన్ భాగాన్ని మాంసపు ముద్ద అనుకుందో.. తెలియదు కానీ ఓ కాకి డ్రోన్ పై దాడి చేసింది. అది ఎంతకూ రాకపోవడంతో దానిని వదిలేసి వెళ్లింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రా పట్టణంలో చోటు చేసుకుంది. భారత్ లో ఫుడ్ డెలివరీ కోసం వాలెట్లు, హంగ్రీ సేవియర్లు బైక్ లపై తిరుగుతూ వాటిని డెలివరీ చేస్తారు. ఈ క్రమంలో వారు అనేక ట్రాఫిక్ సమస్యలను కూడా ఎదుర్కోని సకాలంలో వాటిని డెలివరీ చేసేందుకు యత్నిస్తుంటారు. ఈ ఫుడ్ డెలివరీ యాప్ లతో అనేక మంది యువత దేశవ్యాప్తంగా ఉపాది పోందుతున్నారు.
ఆదునికత, సాంకేతికత, అందుబాటులోకి వచ్చిందని ట్రాఫిక్ జామ్ లు లేకుండా ఆహారాన్ని అందిస్తామని మన ఫుడ్ డెలివరీ యాప్ లు ఇలాంటి డ్రోన్లను మన దేశంలోనూ తీసుకువస్తే బాగుంటూ అని అనుకుంటున్నారా.? అయితే అందుకు మన ప్రభుత్వం ఇప్పటికీ అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే మన యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అస్ట్రేలియాలో మాత్రం డ్రోన్లే డెలివరీ చేస్తుంటాయి. అయితే ఇది ఆహారానికే కాదు కాఫీని కూడా డ్రోన్లే డెలివరీ చేస్తుంటాయి. ఇలానే ఓ కాఫీని డెలివరీ చేయడానికి వెళ్తున్న ఓ డ్రోన్ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎంచక్క గగనంలో విహరిస్తూ నేరుగా కస్టమర్లకు చేరవేసేందుకు బయలు దేరింది,
అంతే ఇది తమ గగనం, తమకే ఇక్కడ విహరించే అనుమతి ఉందని భావించిందో ఏమో తెలియదు కానీ ఓ కాకి డ్రోన్ పై దాడికి దిగింది. అలా ఎందుకు అంటే.. ఆ ఏరియాకు డ్రోన్ కొత్తగా రావడంతో అక్కడే చెట్టు మీద ఉన్న కాకి.. దాన్ని చూసి వెంటనే ఎగురుకుంటూ వెళ్లి దాన్ని వెళ్లకుండా తన నోటితో పట్టి ఆపింది. ఈ ఘర్షణలో కస్టమర్‌కు డెలివరీ చేయాల్సిన ప్రొడక్ట్ కింద పడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వింగ్ అనే ప్రోగ్రామ్ ద్వారా.. ఆస్ట్రేలియాలో డ్రోన్స్‌ను ఆపరేట్ చేస్తుంటారు. గూగుల్‌తో టైప్ అయిన వింగ్… అక్కడ డోర్ టు డోర్ డెలివరీ చేస్తోంది. మెడిసిన్స్, కాఫీ, టీ, ఫుడ్, ఇతర సరుకులను డ్రోన్స్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. అయితే.. ఇలా డ్రోన్ల మీద పక్షులు దాడి చేయడం ఇదే మొదటిసారి ఏం కాదు. ఇదివరకు కూడా ఇలాగే డ్రోన్స్ మీద పక్షులు దాడి చేశాయట.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more