Adorable dadi commands Alexa to sing Ganpati Bhajan అలెక్సా ను అయోమస్థితిలోకి నెట్టిన బామ్మ..

Grandmother instructs alexa to sing ganpati bhajan netizens delighted

grandmother instructs Alexa, Neha Sharma, Neha Sharma grandmother, Dadi Maa and Alexa, Ganapati Bhajan, grandmother, Ganpati Bhajan, grandma viral video, Alexa, Amazon Alexa, Amazon Echo, Internet, social media, viral video

Grandmother Instructs Alexa: A viral video making rounds on the internet has left the social media users delighted. It features an elderly woman giving instructions to Alexa. The way she makes the request is bound to break your lips into a smile.

ITEMVIDEOS: వైరల్: అలెక్సా ను అయోమస్థితిలోకి నెట్టిన బామ్మ..

Posted: 09/28/2021 02:58 PM IST
Grandmother instructs alexa to sing ganpati bhajan netizens delighted

నెట్టింట్లో ఎన్నో వేల వీడియోలు చక్కర్లు కోడుతుంటాయి. వీటిలో వైరల్ గా మారేవి మాత్రం కొన్ని వీడియోలు మాత్రమే. అయితే ఒక్కోసారి ఎంత మంచి వీడియో అయినా వైరల్ కాదు. కానీ పలు సందర్భాలలో ఏ మాత్రం పసలేని వీడియోలు మాత్రం నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంటాయి, అయితే ఏదో ఒక సమయం, సందర్భం వచ్చినప్పుడు మాత్రం పాత వీడియోలు కూడా లైమ్ లైట్ లోకి వచ్చి విపరీతంగా వైరల్ అవుతుంటాయి, ఏ వీడియో ఎప్పుడు ఎందుకు వైరల్ గా మారుతుందో నెటిజనులకే తెలియాలి.

ఇక ప్ర‌స్తుతం ప్ర‌పంచాన్ని శాసించే స్థాయిలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ది చెందుతోంది. అందుకు కారణం నేటి యువత ఎక్కువ సమయంలో ఆన్ లైన్ లోనే గడుపటం. దీంతో వారు ఏ పనిచెప్పినా.. ఎవరో ఒకరి సాయంతో ఆ పని పూర్తి చేయాలనుకోవడం. ఈ క్రమంలో అభివృద్ది చేయబడిందే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్. ఇది ఎంతలా వృద్ది చెందింది అంటే.. ఎకంగా మనుషులనే డామినేట్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఏ టెక్నాల‌జీ చూసినా.. ఏఐతో డెవ‌ల‌ప్ అయిందే. అమెజాన్ నుంచి వచ్చిన అలెక్సా కూడా అదే కోవకు చెందిన సాంకేతిక సాధనం అని ఎందరికీ తెలుసు. అలెక్సా అని పిలిచి.. మ‌న‌కు కావాల్సిన స‌మాచారాన్ని అందులో అడ‌గొచ్చు.

మీకు పాట వినాలని అనిపించడమే ఆలస్యం.. అలెక్సా అని పిలిచి దానికి ఈ పాటను వినిపించు అని చెబితే చాలు ఆ పాటను వినిపిస్తుంది. అలాగే ఏలాంటి సమాచారంమైనా, వాతావరణ నివేదికైనా, వార్తలైనా ఇలా మీకు నచ్చింది మీరున్న చోటు నుంచే ఎలాంటి శ్రమ లేకుండా చేసుకునే వెసలుబాటు కల్పిస్తోంది. అంతేకాదు అలెక్సా స్విచ్ఛాన్ ది టీవీ అని చెప్పినా అది టీవిని ఆన్ చేస్తోంది. అయితే ఈ సాధనం గురించి నామమాత్రంగా తెలుసుకుందో.. లేక పిల్లలు కమాండ్ చేస్తుండగా చూసిందో కానీ ఓ బామ్మ కూడా అలెక్సాకు కమాండ్ ఇచ్చింది. అయితే ఈ కమాండ్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ఎందుకంటారా..

ఎంత ఏఐ టెక్నాలజీ అయినా దానికుండే పద్దతిలోనే కమాండ్ ఇవాలి. కానీ ఆ విషయం తెలియని ఓ బామ్మ ఇచ్చిన కమాండ్ తో అలెక్సా అయోమయ స్థితిలోకి జారుకుంది. అదెలా అంటారా.. ఓ బామ్మ అలెక్సా వద్దకు వచ్చి దానికి హిందీలో కమాండ్ ఇచ్చింది. గ‌ణ‌ప‌తి స్తోత్రం చెప్పు. గ‌ణ‌ప‌తి ఆరాద‌ణ చేయి.. గ‌ణ‌ప‌తి స్లోకాలు ప్లే చేయ్.. గణపతికి సంబంధించిన అన్నీ ప్లే కావాలి.. ఏదీ ఆగ‌కూడ‌దు.. అంటూ ఆ బామ్మ అలెక్సాకు కమాండ్ చేసింది. అయితే మనుషులకు చెప్పినట్లుగా అలెక్సాను కూడా కాస్తా దగ్ధత స్వరంతో బెదిరించిన తీరు చూసి నెటిజ‌న్లు అవాక్క‌వుతున్నారు. ఆ వీడియోను త‌న మ‌న‌వ‌రాలు నేహా శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

 
 
 
View this post on Instagram

A post shared by Neha Sharma (@lifeneedsaholiday)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles