మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నిమూచ్ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ పై ముగ్గరు అగంతకులు సామూహిక అత్యాచారం జరిపి ఆపై లైంగిక దాడిని వీడియో తీసి.. ఈ ఘటనపై ఎవరికైన చెబితే చంపుతామని బెదిరించి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా ఓ మహిళా పోలీసు ఉన్నతాధికారి బ్రతూమ్ లో స్పై కెమెరాను పెట్టి వేధించిన ఘటన కూడా మధ్యప్రదేశ్‌లోనే వెలుగులోకి వచ్చింది. ఇది రాష్ట్ర రాజధాని భోపాల్ లోనే వెలుగు చూడటం కలకలం రేపుతోంది.
కానిస్టేబుల్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని సదరు మహిలా పోలీసు అధికారి ఆమె డ్రైవర్ గా నియమించుకోగా.. తన ఉన్నతాధికారి అన్న కనీస ఇంకితాన్ని మర్చిపోయి.. అమెనే బ్లాక్ మెయిల్ చేశాడు. అమె ఇంట్లోని బాత్రూమ్లో వీడియో మోడ్ అన్ చేసిన సెల్ ఫోన్ కెమెరా పెట్టి వసూళ్లకు తెరలేపాడు. రూ.5 లక్షలు ఇస్తే వీడియోలు డిలీట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఓ పోలీస్ అధికారిణికి డ్రైవర్ గా ఓ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22న అధికారి ఇంట్లోకి వెళ్లిన కానిస్టేబుల్.. ఆమె బాత్రూమ్ తలుపుపై వీడియో రికార్డింగ్ ఆన్ చేసి సెల్‌ఫోన్ ఉంచాడు.
స్నానం కోసం వెళ్లిన ఆమె ఆ సెల్‌ఫోన్ గుర్తించి వెంటనే బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ పరారయ్యాడు. తర్వాత సెప్టెంబర్ 26వ తేదీన ఇంటికొచ్చిన ఆ ఆకతాయి డ్రైవర్ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకపోతే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీస్ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసింది. భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు. కాగా శనివారం నిందితుడు హబీబ్‌గంజ్ పోలీస్‌స్టేషన్ చేరుకున్నాడు. తనపై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) రామ్‌జీ శ్రీవాస్తవ, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more