Anand Mahindra is surprised by this 'Idli innovation' ఆనంద్ మహీంద్రా పోస్టు చేసిన ఐస్ క్రీమ్ ఇడ్లీని చూశారా.?

Viral photo of idli with ice cream stick leaves foodies divided online

idli, idli popsicle, idli ice cream, bengaluru idli ice cream stick, idli stick ice cream, weird food, bizarre food, idli with sticks, odd news, viral news

After butter chicken golpappe, a photo of ‘idli ice-cream’ has taken social media by storm and started a serious conversation online, leaving food lovers divided. In the image going viral, fluffy round idlis have got an usual makeover – shaped like a chocolate bar, tucked into a ice-cream stick.

ఆనంద్ మహీంద్రా పోస్టు చేసిన ఐస్ క్రీమ్ ఇడ్లీని చూశారా.?

Posted: 10/01/2021 07:45 PM IST
Viral photo of idli with ice cream stick leaves foodies divided online

కొందరికి అది అద్భుత అల్పాహారం. నిజానికి కూడా ఈ అల్పాహారం ఎంతో రుచికరం, శుచికరం.. మరియు అరోగ్యకరం కూడా. కానీ దీనిని వారంలో మూడునాలుగు సార్లు తినాలంటే.. ఎవరైనా అనే మాట.. అబ్బా.. మళ్లీ ఇడ్లీయేనా? ఔనండీ. ఎంతటి పేదవాడి నుంచి పెద్దదవాళ్ల వరకు అధికంగా అందరికీ కావాల్సిన అరోగ్యకరమైన అల్పాహారం ఇడ్లీనే. అయితే మాటిమాటికీ అదే చేస్తుంటే ఇడ్లీలపైనే విరక్తి వస్తుంది. అందుకనే దీనిని రుచికరంగా మార్చేందుక అమ్మలు ఒక రోజు సాంబర్, టమాటా చట్నీ, మరో రోజు సాంబర్ కొబ్బరి చట్నీ.. ఇలా రకరకాల చట్నీలు చేస్తూ ఏమారుస్తుంటారు.

ప్ర‌తి మ‌ధ్య త‌ర‌గ‌తి ఇంట్లోనూ పిల్ల‌లు ఇడ్లీ అంటే దడుచుకుని టిఫిన్ వద్దు బాబోయ్ అంటూ మారం చేస్తుంటారు. త‌ర‌త‌రాలుగా పిల్ల‌ల పాలిట ఇడ్లీ ఓ విల‌న్‌గా తయారైది ఈ ఇడ్లీ. నోటికి అస్స‌లు రుచించ‌ని ఈ ఇడ్లీని చూసి ఆమ‌డ‌దూరం పారిపోతారు మ‌న ఇళ్ల‌లో పిల్ల‌లు. అయితే ఎన్ని పర్యాయాలైనా చట్నీలను, సాంబార్లను మార్చే అమ్మలు.. ఇడ్లీని ఎందుకని మార్చారు. సరిగ్గా ఇలాంటి ప్రశ్నే బెంగుళూరువాసుల్లో కలిగిందో ఏమో తెలియదు కానీ అక్కడ ఇడ్లీ రూపాన్ని మార్చేశారు. అదేంటి ఇడ్లీ కొన్ని చోట్ల గుండ్రంగా మరికొన్ని చోట్ల స్క్వేర్ గా వుండటం చూశాం. మరీ బెంగళూరులో ఎలా మార్చారబ్బా అన్న అనుమానం కలిగిందా.?

మ్యాటర్ లోకి ఎంట్రీఇస్తూ బిజినెస్ టైకూడన్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేసిన ఈ ఇడ్లీ ని చూస్తే ఔరా ఇలా కూడా ఇడ్లీలను చేయవచ్చా అన్న అనుమానం కలగక మానదు. ఇక పిల్ల‌లు కూడా ప‌రుగు ప‌రుగున వ‌చ్చి ఓసారి టేస్ట్ చేద్దామ‌నుకుంటారు. కాస్త బుర్ర‌కు ప‌ని చెప్పాలే కానీ.. ఇలాంటి వినూత్న‌మైన ఆలోచ‌న‌లు ఎన్నో వ‌స్తాయ‌ని నిరూపిస్తోంది బెంగ‌ళూరులోని ఓ రెస్టారెంట్‌. అక్క‌డ ఇడ్లీల‌ను కూడా ఐస్‌క్రీమ్‌ల‌లాగా చేసి ఇస్తుండ‌టంతో ఈ బోరింగ్ బ్రేక్‌ఫాస్ట్‌ను కూడా పిల్ల‌లు ఎగ‌బ‌డి తింటున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోనే ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేస్తూ.. ఇండియా ఇన్నోవేష‌న్ క్యాపిట‌ల్ బెంగ‌ళూరు.. ఎవ‌రూ ఊహించ‌ని రంగాల్లోనూ త‌న క్రియేటివిటీని చూపిస్తోంది. క‌ట్టెపుల్ల‌కు ఇడ్లీ.. దానికి సాంబార్‌, చ‌ట్నీ ఇవ్వ‌డం బాగుంద‌న్న‌ట్లుగా ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు. ఈ ఫొటో వెంట‌నే ట్విట‌ర్‌లో వైర‌ల్‌గా మారిపోయింది. ఈ ఐడియా అద్భుతంగా ఉన్న‌దంటూ ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌కు ఎంతో మంది స్పందించారు. స‌డెన్‌గా చూసి దీనిని ఓ ఐస్‌క్రీమ్ అనుకున్నా అంటూ ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు. మ‌రి ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది? మీ పిల్ల‌ల‌కు కూడా ఇడ్లీ తినిపించాల‌నుకుంటే ఇంట్లో స‌ర‌దాగా ఇలాంటి వినూత్న ప్ర‌యోగాలు చేస్తూ ఉండండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles