నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల దారుణ మారణకాండను నిరసిస్తూ.. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకుని సీతాపూర్ పీఏసీ గెస్ట్ హౌజ్ లో నిర్భంధించగా.. అపరిశుభ్ర గదిని అమె చీపురు పట్టి శుభ్రంచేశారు. తాజాగా ఆమెమరోమారు అమె చీపురు పట్టారు. మొదటిసారి కాకతాళీయంగా జరిగినా.. రెండవ సారి మాత్రం అమె బీజేపి ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ కు గట్టి కౌంటర్ ఇచ్చేందుకే చేశారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ దళిత వాడను అకస్మికంగా సందర్శించిన ప్రియంకా.. మరోమారు అక్కడ చీపురు చేతపట్టి ఆ దళితవాడను శుభ్రం చేశారు. అమెకు దళిత వాడలోని స్థానిక మహిళలతో పాటు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు కూడా జత కలిశారు. అమె మొదటిసారి గదిని శుభ్రం చేయడంపై ముఖ్యమంత్రి యోగి.. స్పందిస్తూ చేసిన జాతి అహంకార వ్యాఖ్యలపై భగ్గుమన్న అమె.. సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చీపురు పట్టడం ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. ఆలోచనా విధానాన్ని సీఎం యోగి మార్చుకోవాలని సూచించారు.
ప్రియాంక గాంధీ గదిని శుభ్రం చేయడంపై ‘దీని కోసం మాత్రమే వారు ఫిట్‌గా ఉండాలని ప్రజలు కోరుకుంటారు. అందుకే వారి స్థాయిని తగ్గించారు. వ్యతిరేకతను వ్యాప్తి చేయడం తప్ప వీరికి వేరే పని లేదు’ అని సీఎం యోగి కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ లక్నోలోని దళిత ప్రాంతమైన లవ్ కుష్ నగర్‌ను సందర్శించారు. స్థానికులతో మాట్లాడిన తర్వాత చీపురు పట్టి అక్కడి మహర్షి వాల్మీకి ఆలయంలో శుభ్రం చేశారు. ‘దేశంలోని కోట్లాది మంది మహిళలు, పారిశుధ్య కార్మికులు శుభ్ర పరిచేందుకు ప్రతి రోజూ చీపురులను ఉపయోగిస్తారు. ఇది వారి సరళత, ఆత్మగౌరవానికి చిహ్నం’ అని అన్నారు.
సీఎం యోగి తన వ్యాఖ్యల ద్వారా తనను మాత్రమే అవమానించలేదని, ఈ పని చేసే కోట్లాది మంది దళిత సోదరులు, సోదరీమణులు, పారిశుధ్య కార్మికులను ఆయన అవమానించారని ప్రియాంక గాంధీ విమర్శించారు. దీంతో వీరితోపాటు కలిసి శుభ్రపరిచేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. చీపురును ఉపయోగించడం, శుభ్రపరచడం ఆత్మగౌరవ చర్య అని యోగిజీకి తెలియజేశానంటూ ఘాటుగా స్పందించారు. సీఎం యోగి దళిత వ్యతిరేకి అంటూ అరోపించిన అమె.. యోగీ కులతత్వ ప్రకటన చేయడం ద్వారా తన దళిత వ్యతిరేక మనస్తత్వాన్ని కనబర్చారని అమె అన్నారు.
झाड़ू लगाना स्वाभिमान का काम है।
— UP Congress (@INCUttarPradesh) October 8, 2021
अपनी सोच बदलिए @myogiadityanath pic.twitter.com/E3S6eTxjrZ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more