మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలలో ధరల పట్టికను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కర్ణన్ విడుదల చేశారు. ఎన్నికలు ముగిసే లోపు ప్రతీ అభ్యర్థి మూడు పర్యాయాలు తగు బిల్లులతో తమ ఎన్నికల ఖర్చులను ఆమోదం చేసుకోవాలని తెలిపారు. కాగా ఈ సారి ఉప ఎన్నికల ఖర్చును రూ. 30.80 లక్షలుగా నిర్ణయించారు. ఇదే గరిష్టవ్యయమని, దీనిని దాటి అభ్యర్థులు ఎవరూ ఖర్చులు పెట్టరాదని సూచించారు. ఇక మీడియా ప్రకటనలు కూడా ఎన్నికల వ్యయం కిందకే వస్తాయని తెలిపారు.
ప్రచారంలో వినియోగించే టోపీలు, కండువాల నుంచి సభల్లో వినియోగించే టెంట్లు, లౌడ్ స్పీకర్లు, డోలు కళాకారులు, దప్పుల కళాకారులు, కళాబృందాల వరకు వ్యయాన్ని నిర్ణయించింది. ఫంక్షన్ హాళ్లు, ఏసీ, నాన్ఏసీ, పాంప్లెంట్లు, వీడియో గ్రాఫర్స్, టీ షర్టులు, ఫైర్ క్రాకర్స్ ఇలా అన్నింటికి ధరలను ఖరారు చేసింది. ఖరారు చేసిన ధరల వివరాలను శుక్రవారం పార్టీల అభ్యర్థులకు సూచించింది. ఇకపై ఇవే ధరలను బట్టి అభ్యర్థుల వ్యయాన్ని ఎన్నికల డైరీలో నమోదు చేయడం సుస్పష్టం. ఇక ఎన్నికల ఏజెంట్ పేరున బ్యాంకులో జాయింట్ ఖాతాను తెరచి అందులోంచి మాత్రమే డబ్బును వినియోగించాల్సి వుంటుందని తెలిపారు.
నిర్ణయించిన ధరల వివరాలిలా..
* లౌడ్ స్పీకర్లు విత్ అంప్లిఫైర్, మైక్రోఫోన్ రోజుకు రూ.600(వంద వాట్స్), రూ.1500(200వాట్స్), టెంటుకు సైజును బట్టి రూ.2వేల నుంచి 2800, క్లాత్ బ్యానర్(స్కె్వర్ ఫీటుకు) సైజును బట్టి రూ.8 నుంచి రూ.12 వరకు, క్లాత్ ఫ్లాగ్స్‌కు రూ.65, ప్లాస్టిక్ ఫ్లాగ్స్‌కు రూ.350, పోస్టర్స్ విత్ మల్టీకలర్స్ సైజును బట్టి రూ.8వేల నుంచి రూ.70వేల వరకు.
* హోర్డింగ్స్‌కు అన్ని కలిపి రూ.9500ల నుంచి రూ.11వేలు, కటౌట్ స్క్వేర్ ఫీటుకు రూ.90, వీడియో మేకింగ్ చార్జీ(ఒక రికారి్డంగ్) రూ.10వేలు, ప్రచార రథం(ఆడియో) ఒక రికార్డింగ్‌కు రూ.5వేలు.
* అద్దె వాహనాలకు సంబంధించి జీపు, టెంపో, ట్రకెట్, సుమో, క్వాలీస్‌కు రోజుకు రూ.1700, ట్రాక్టర్‌కు రూ.1500, ఇన్నోవా రూ.2200, మిని బస్ రూ.2500, కారు రూ.1400, త్రీవిలర్స్, ఆటో రిక్షా రూ.450, బత్త చార్జీ డ్రైవర్‌కు ఒక రోజుకు రూ.400.
* హోటల్ రూం, గెస్ట్ హౌస్అద్దెకు సంబంధించి డీలర్స్ పర్డే రూ.2వేలు, నార్మల్ పర్ డే రూ.వెయ్యి, ఫర్నీచర్ అద్దెకు సంబంధించి ప్లాస్టిక్ ఛైర్ రూ.7, వీఐపీ ఛైర్ రూ.75, సోఫా రూ.350, టేబుల్ రూ.50, వీడియో ప్రొజెక్టర్ పర్డే రూ.1500, కండువా రూ.15, టోపీ రూ.20.
* కళాబృందాలు ఒక్కొక్కరికి రూ.500, డోలు ఆర్టిస్ట్‌కు రూ.500, దప్పులు ఆర్టిస్ట్‌కు రూ.500, ద్విచక్రవాహనం రూ.200, ఫంక్షన్ హాల్ విత్ ఏసీ రూ.10వేలు, నాన్ ఏసీ రూ.5వేలు, వీడియో గ్రాఫర్ ఛార్జీ రూ.1500, పాంప్లెంట్లు(చిన్నవి) వెయ్యికి రూ.250, పెద్దవి వెయ్యికి రూ.500.
* స్నాక్స్‌కు సంబ«ంధించి ఒక పెద్ద సమోసాకు రూ.12, చిన్న సమోసాకు రూ.3, సాఫ్ట్ డ్రింకు రూ.10, లస్సీ రూ.5, టీ షర్ట్ రూ.100, బలూన్ ప్యాకెట్ పర్ ప్యాకెట్ రూ.150, ఫైర్ క్రాకర్స్ పర్ కేజీ రూ.300, ప్లకార్డు ఎ3 రూ.20, ఎ4 రూ.12, గర్లాండ్ స్మాల్ రూ.50, గజమాల రూ.800, చిన్న ఫ్లాగ్ రూ.30, పెద్ద ఫ్లాగ్ రూ.100, రెడ్ కార్పెట్ రూ.300, గ్రీన్ కార్పెట్ రూ.500, ఫ్యాన్ రూ.100, కూలర్ రూ.300, ఎల్ఈడీ స్క్రీన్ సైజును బట్టి రూ.10వేల నుంచి రూ.లక్ష, ఎల్ఈడీ స్క్రీన్ విత్ సౌండ్ సిస్టమ్,జనరేటర్, వెహికిల్ సైజును బట్టి రూ.15వేల నుంచి రూ.1.20లక్షలు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more