క్వార్టర్ అనగానే నూటికి తొంబై మంది మగవారికి గుర్తుకు వచ్చేది మద్యం సిసానే. అంతలా మద్యం మగవారి జీవితాలపై ప్రభావం చూపుతోందన్న విషయం దీనిని బట్టి అర్థమౌతోంది. మద్యం నిషేధం విధించి.. రాష్ట్రాలలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గించే అవకాశం వున్నా ప్రభుత్వాలు ఆదాయ వనురును కొల్పెవడం ఇష్టం లేక అంగీకరించవు. సర్లే ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయని తాగితే.. పోలీసుల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు.. మద్యం సేవించిన మందుబాటును అడ్డంగా బుక్ చేసి.. కటకటాల వెనక్కి నెట్టేస్తుంటారు. మద్యంతో అటు అమ్మకాలపై ఇటు పోలీసులు కేసులు, కోర్టుల ఫైన్లతో రెండు చేతులా అర్జిస్తున్నాయి ప్రభుత్వాలు.
ఇక అసలు విషయానికి వస్తే.. వ్యాపారవేత్తలు, సేల్స్ రంగంలో వున్నవారు.. ఎకానమిస్టులు, ఇలాంటి వారికి తెలిసిన క్వార్టర్ మరోకటి. అదేంటి అంటే ఏడాదిలో నాలుగు క్వార్టర్లు అంటే మూడు నెలలకు ఒక క్వార్టర్ గా పరిగణిస్తారన్న మాట. అది కూడా ఏప్రిల్ నుంచి ప్రారంభమై మార్చితో ముగుస్తుందన్న మాట. అయితే ఆన్ లైన్ క్లాసులో క్వార్టర్ అనగానే తగబడిన విద్యార్థి.. మూడు మాసాల క్వార్టర్ ను చెప్పేందుకు బదులు ఏకంగా మద్యం క్వార్టర్ ను గుర్తుతెచ్చుకున్నాడు. దీంతో 30 ఎంఎల్ అంటూ ఆన్సర్ రాశాడు.
వివరాల్లోకి వెళ్తే.. సీఏ ధావల్ పురోహిత్.. ఆన్ లైన్ లో సీఏ క్లాసెస్ తీసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక క్వార్టర్ అంటే ఎంత? అనే ప్రశ్నను తన స్టూడెంట్స్ ను అడిగాడు. ఒక స్టూడెంట్.. అక్కడ ఉండే చాట్ బాక్స్‌లో వెంటనే ఏమాత్రం తడుముకోకుండా 30 ఎంఎల్ అని రాశాడు. దీంతో.. ఆ ప్రొఫెసర్‌కు చిర్రెత్తుకొచ్చింది. అరె బాబు.. క్వార్టర్ అంటే 30 ఎంఎల్… కాదు అంటూ తన పళ్లతో పెదాలను కోరుకుతూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. మాస్టారు.. మండిపడటంతో విద్యార్థులందరూ నవ్వులందుకున్నారు. అప్పుడకు కానీ వారికి విషయం అర్థంకాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు అయితే ఆ వీడియోను చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు. సీఏ క్లాసులోనే ఇలాంటివి జరుగుతాయి? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంతకీ ఆ ఆన్సర్ ఇచ్చింది ఎవరు? అంటూ నెటిజన్లు కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఇదిలావుండగా.. విద్యార్థి ఇచ్చిన సమాధానం కరెక్టా అనే దానిపై కూడా చర్చజరుగుతోంది. విద్యార్థికి అసలు అన్సర్ తెలియదని, మండిపడ్డిన ప్రోఫెసర్ కూడా బదులు తెలియదని అంటున్నారు నెటిజనులు. అసలు ఆన్సర్ ఏంటంటే అంటూ నెటిజనులు 180 ఎంఎల్ అని రాసి మరీ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇక ఆలస్యమెందుకూ ఈ 11 సెక్షన్ల నిడివిగల వీడియోను మీరు ఓ లుక్కేయండీ.
— Avdhoot D (@avdhootd007) October 3, 2021
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more