Several killed in bow and arrow attack in Norway నార్వేలో డానిష్ దేశస్థుడి నరేమేధం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Kongsberg five dead in norway bow and arrow attack suspect held

Danish citizen held, bow arrows attack, five people killed, Two injured, Norway Oslo officials, Oslo, Norwegian capital, norway, crime, norway bow and arrow attack, norway terrorism, world news

A 37-year-old Danish citizen is suspected of killing five people in a bow-and-arrow attack in the Norwegian town of Kongsberg in a rare incident of mass killing in Norway, police said. near the Norwegian capital of Oslo before he was arrested, authorities said. The police chief in the town of Kongsberg said there was “a confrontation” between officers and the assailant, but he did not elaborate.

నార్వేలో డానిష్ దేశస్థుడి నరేమేధం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

Posted: 10/14/2021 07:55 PM IST
Kongsberg five dead in norway bow and arrow attack suspect held

నిత్యం ప్రశాంత వాతావరణం కొలువుండే నార్వేలో అలజడి చెలరేగింది. ప్రశాంతకు మారుపేరైన నార్వేలోని ఓ గ్రాసరీ స్టోర్ లో డానిష్ దేశస్తుడు నరమేధానికి ఒడిగట్టి ఏకంగా ఐదుగురిని హతమార్చాడు. నార్వేజియన్ రాజధాని నగరమైన ఒస్లోలోని కాంగ్స్‌బర్గ్‌లో బుధవారం రాత్రి ఒక వ్యక్తి బాణాలతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా సోషల్ మీడియాలో వస్తున్న భిన్నమైన కథనాల చక్కర్లు కొడుతున్న తరుణంలో పోలీసులు నిందితుడి గురించిన దేశం గురించి వెలువరించారు.

కానీ అతను ఎవరు..? ఏమీటి అన్న వివరాలను మాత్రం తెలుపలేదు. పోలీసుల ప్రకారం, దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే అతడి గురించి గానీ, మరణించిన వారి గురించి గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఉగ్రవాద దుశ్చర్యనా? లేక శుత్రుత్వంతో చేసిందా? అనేది ఇంకా తెలియరాలేదు. కాంగ్స్‌బర్గ్‌లోని కూపే ఎక్స్‌ట్రా సూపర్ మార్కెట్ లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి అక్కడున్న వారిపై బాణంతో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో అక్కడ ఉన్న ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

కాగా, దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని, ఇప్పడు ఇంతకన్నా ఎక్కువ ఏమీ చెప్పలేమని కాంగ్స్‌బర్గ్‌ పోలీస్‌ చీఫ్‌ ఒవిండ్‌ ఆస్‌ అన్నారు. ఒవిండ్ ఆస్ ప్రకారం, దాడి చేసిన వ్యక్తి మొదట నగరంలోని రద్దీ కూడలిలో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకున్నాడు. అనంతరం ఇటు వైపు పరుగెత్తాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. కాగా, ఘటనా స్థలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రెమెన్ ప్రాంతం నుంచి దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ సమయంలో అతను పోలీసులపై దాడికి కూడా ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles