బ్రిటన్ లో దారుణం జరిగింది. చర్చిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పార్లమెంటు సభ్యుడిని అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. దుండగుడు ఎంపీ పై కత్తితో విరుచుకుపడి ఏకంగా 17 పోట్లు పోడిచి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత, ఎంపీ అయిన సర్ డేవిడ్ అమీస్ (69) శుక్రవారం తూర్పు లండన్ లోని స్థానిక లీ-ఆన్-సీ అనే చిన్న గ్రామంలో ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై అకస్మాత్తుగా ఓ వ్యక్తి దాడిచేసిన కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలు కావడంతో పాటు తీవ్ర రక్తస్రావం ఎదుర్కన్న పార్లమెంటు సభ్యుడు ఘటనాస్థలంలోనే మరణించారు.
అయితే ఎంపీపై హత్యకు తెగబడిన వ్యక్తిని బ్రిటెన్ లోని సోమాలి ప్రాంతానికి చెందిన బ్రిటన్ పౌరుడిగా గుర్తించారు పోలీసులు. అయితే హత్య చేసిన తరువాత నిందితుడు ఘటనాస్థలంలోనే మౌనంగా కూర్చోని పోలీసులు రాక కోసం వేచిచూశాడని స్థానికులు తెలిపారు, దీంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమీస్ 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. ఎసెక్స్‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జంతు సమస్యలతోపాటు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. అమీస్ మృతికి ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను భయంకరమైనదిగా, తీవ్ర దిగ్భ్రాంతికరమైనదిగా ప్రతిపక్ష లేబర్ పార్టీ అభివర్ణించింది.
డేవిడ్ అమిస్ సేవలను ప్రశంసించిన బ్రిటన్ రాణి ఎలిజిబెత్ అయనకు సర్ అనే బిరుదునిచ్చి సత్కరించారు. బ్రిటన్‌లో ఎంపీలపై దాడులు గతంలోనూ పలుమార్లు జరిగాయి. 2016 బ్రెగ్జిట్ సమయంలో లేబర్ పార్టీ ఎంపీ జో కాక్స్ కాల్చివేతకు గురయ్యారు. 2010లో లేబర్ పార్టీ ఎంపీ స్టీఫెన్ టిమ్స్‌పై దాడిచేసిన దుండగులు కత్తితో విచక్షణ రహితంగా పొడిచారు. 2000వ సంవత్సరంలో లిబరల్ డెమొక్రటిక్ ఎంపీ నీగెల్ జోన్స్‌పై దాడి జరిగింది. జులై 30, 1990లో కన్జర్వేటివ్ ఎంపీ ఇయాన్ గౌ కారు బాంబు దాడిలో మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో పార్లమెంటు సభ్యులకు కల్పించాల్పిన భద్రతపై డిమాండ్లు పెరిగాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more